ఐపీఎల్ 2020

  • associate partner

KL Rahul: రాహుల్ కళ్లు, చెవులు ఎందుకు మూస్తాడు? దానికర్థం ఏంటి?

సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు.. వికెట్ పడినప్పుడు బౌలర్లు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఐతే కాస్త డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకునే వారు చాలా అరుదుగా ఉంటారు.

news18-telugu
Updated: October 10, 2020, 11:36 PM IST
KL Rahul: రాహుల్ కళ్లు, చెవులు ఎందుకు మూస్తాడు? దానికర్థం ఏంటి?
కేఎల్ రాహుల్ (Image:BCCI)
  • Share this:
సెంచరీ కొడితే బ్యాట్స్‌మెన్‌కు ఆ కిక్కే వేరు.. బ్యాట్స్‌మెన్‌కు అసలా సంతోషమే వేరు..! సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సాధిస్తే.. కొందరు ఆటగాళ్లు బ్యాట్ గాల్లోకి లేపి అటూ ఇటూ తిప్పితారు. ఇంకొందరు గ్రౌండ్‌ను ముద్దాడుతారు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం హెల్మెట్ తీసి.. కళ్లు మూస్తాడు. అదే సమయంలో చెవులను చేతి వేళ్లతో మూసేస్తాడు. ఇటీవల సెంచరీ సాధించినప్పుడు ఇలాంటి సెలబ్రేషనే చేశాడు. ఆ ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సెంచరీ చేసినప్పుడు ఎగిరి గంతేయకుండా.. సైలెంట్‌గా కళ్లు, చెవులు మూసుకుంటాడేంటని చాలా మంది అనుకుంటారు.

ఐతే ఈ సెలబ్రేషన్‌కు స్పెషల్ రీజన్ ఉంది. తనను విమర్శించే వాళ్ల మాటలు అస్సలు విననని.. విమర్శలను ఏ మాత్రం పట్టించుకోనని కేఎల్ రాహుల్ సింబాలిక్‌గా చెబుతాడట. దానికి అర్ధం ఇదన్న మాట..! హేటర్స్‌కు ఈ ఒక్క సంజ్ఞతోనే ధీటైన జవాబు ఇస్తాడు ఈ టీమిండియా ప్లేయర్.


సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు.. వికెట్ పడినప్పుడు బౌలర్లు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఐతే కాస్త డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. సౌతాఫ్రిక బౌలర్ తబ్రేజ్ షంసి, వెస్టిండిస్ షెల్డన్ కాట్రెల్ ఇలాంటి కోవలోకే వస్తారు. వికెట్ తీసినప్పుడు షంసి మ్యాజిక్ చేస్తాడు. ఇక కాట్రెల్ గట్టిగా సెల్యూట్ చేస్తాడు.
Published by: Shiva Kumar Addula
First published: October 10, 2020, 11:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading