Home /News /ipl /

CANCEL BIRYANI SUNRISERS HYDERABADS SPICY JIBE AFTER IPL WIN IS TOO HOT TO HANDLE FOR RAJASTHAN ROYALS SK

IPL 2020: రాజస్థాన్‌కు హైదరాబాద్ రివర్స్ పంచ్.. బిర్యానీ మసాలాను తట్టుకోలేరు

IPL 2020: రాజస్థాన్‌కు హైదరాబాద్ బిర్యానీ పంచ్.. మసాలాను తట్టుకోలేరు

IPL 2020: రాజస్థాన్‌కు హైదరాబాద్ బిర్యానీ పంచ్.. మసాలాను తట్టుకోలేరు

IPL 2020: గురువారం దుబయ్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది.

    దుబయ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టిన విషయం తెలిసిదే. 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఐతే మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ టీమ్‌పై ఎస్‌ఆర్ఎచ్ ట్విటర్ వేదికగా పంచ్ వేసి ట్రోల్ చేసింది. 'బిర్యానీ ఆర్డర్ కాన్సిల్ చేయండి. మా స్నేహితులు మసాలా ఘాటును తట్టుకోలేరు. మీకు దాల్ బాటీ సరిపోతుంది.' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. మ్యాచ్‌లకు మ్యాచ్.. ట్వీట్‌కు ట్వీట్ చేసి... రాయల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది వార్నర్ సేన. హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో..రాజస్థాన్‌లో దాల్ బాటీ అంత ఫేమస్..! SRH చేసిన ఈ ట్వీట్ ఆధారంగా RR టీమ్‌ను హైదరాబాద్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. లేదంటే మా జట్టునే ట్రోల్ చేస్తారా అని ట్వీట్ల మోత మోగిస్తున్నారు. వన్ లార్జ్ బిర్యానీ అని మరో ట్వీట్ చేసి అద్దిరిపోయే పంచ్ వేసింది ఎస్‌ఆర్ఎచ్.





    ఏంటీ బిర్యానీ గొడవ..?

    అక్టోబరు 11న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. తెవాటియా రెచ్చిపోవడంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ జట్టుపై సైటెర్లు వేస్తూ ట్వీట్ చేసి రాయల్స్ టీమ్. 'హే జోమాటో.. మేము ఒక లార్జ్ హైదరాబాదీ బిర్యానీ కోసం ఆర్డర్ ఇవ్వాలనుకుంటు‌న్నాం. లొకేషన్- వన్ అండ్ ఓన్లీ రాయల్ మిరేజ్' అని ట్వీట్ చేసింది. ఆ రోజు ప్రపంచ అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవం కావడంతో.. 'వరల్డ్ బిర్యానీ డే' అని ట్యాగ్ చేసింది. అందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది.

    కాగా, గురువారం దుబయ్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది. మనీష్ పాండే 47 బంతుల్లో 83 పరుగుల చేసి సత్తా చాటాడు. విజయ్ శంకర్ 51 బంతుల్లో 52 పరుగులు చేశాడు. బెయిర్ స్టో 10, వార్నర్ 4 రన్స్ మాత్రమే చేశారు. ఓపెనర్ల వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది హైదరాబాద్. మొదటి ఓవర్‌లోనే వార్నర్, మూడో ఓవర్లో బెయిర్ స్టో ఔటయ్యారు. 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సన్‌రైజర్స్. ఐతే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే, విజయ్ శంకర్ అద్భుతమైన పార్ట్‌నర్‌షిప్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇద్దరు కలిసి ఏకంగా 140 పరుగులు జోడించారు.

    టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ 36, బెన్ స్టోక్స్ 30, రియాన్ పరాగ్ 20, స్మిత్ 19, ఊతప్ప 19 పరుగులు చేశారు. మొదట్లో మంచి జోష్ మీదున్న ఊతప్ప.. 4వ ఓవర్లో అనవసర పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్సన్.. బెన్‌స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 12, 13 ఓవర్లలో సామ్సన్, స్టోక్స్ ఔట్ కావడంతో రాజస్థాన్ స్కోర్ నెమ్మదించింది. అనంతరం జోస్ బట్లర్ కూడా ఔట్ అయ్యారు. 19వ ఓవర్లో భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి.. హోల్డర్ బౌలింగ్‌లో స్మిత్, రియాన్ పరాగ్ పెవిలియన్ చేరారు.

    ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 13 సార్లు తలపడ్డాయి. హైదరాబాద్ 7 మ్యాచ్‌ల్లో గెలవగా.. రాజస్థాన్ ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు అక్టోబరు 11న దుబాయ్ వేదికగా హైదరాబాద్, కోల్‌కతా ఢీకొన్నాయి. ఆ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది వార్నర్ సేన. అంతేకాదు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్.

    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం నాలుగింటిలో గెలిచింది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా..4 మాత్రమే గెలిచింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలయింది. 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది స్మిత్ సేన. శుక్రవారం షార్జా వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Rajasthan Royals, Sun risers hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు