IPL 2020: పాపం ఆర్బీబీ.. ఈసారైనా సాధిస్తుందా?..

మాహేమీ క్రికెటర్లతో కలిగి ఉంది . రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, బ్రాండన్ మెకొల్లమ్, డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్ళతో అల్ టైం టైటిల్ ఫెవరెట్ జట్టుగా నిలిచింది.

Rekulapally Saichand
Updated: July 27, 2020, 3:39 PM IST
IPL 2020: పాపం ఆర్బీబీ.. ఈసారైనా సాధిస్తుందా?..
ఏబీ డివిలియర్స్, విరాట్ కొహ్లీ (Twitter image)
  • Share this:
ఐపీఎల్‌లో చాలా మందికి ఫెవరెట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హేమాహేమీ క్రికెటర్లు అంతకుమించి టీమిండియా సారథి కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు. 11 ఏళ్ల సుదీర్ఘ ఐపిఎల్ ప్రస్థానంలో బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్‌ను సాధించలేక పోయింది. మూడు సార్లు ఫైనల్ వరకు వేళ్ళి ట్రోఫీని గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ ప్రస్ధానం

బెంగుళూర్ జట్టు తొలి సీజన్ నుంచే హేమాహేమీ క్రికెటర్లతో కలిగి ఉంది . రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, బ్రాండన్ మెకొల్లమ్, డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్ళతో అల్ టైం టైటిల్ ఫెవరెట్ జట్టుగా నిలిచింది. 2008లో జరిగిన ఆరంభ సీజన్‌లో బెంగళూరు  వరుస పరాజయాలతో ఏడో స్థానంతోనే నిలిచింది. రెండో సీజన్‌లో మాత్రం బెంగళూరు అదరగొట్టింది. అందరి అంచనాలను తలికిందులు చేస్తూ ఫైనల్ వరకు వెళ్ళింది. డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక మూడు సీజన్‌లో సెమీఫైనల్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆ తర్వాతి సీజన్‌లలో కూడా బెంగళూరు జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2015లో మాత్రం బెంగళూరు అనూహ్యంగా పుంజుకుంది. మూడో స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. కానీ క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరుకు చెన్నై చేతిలో ఓటమి తప్పలేదు. 2016లో అసాధరణమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరింది. కానీ అప్పుడు కూడా రాయల్ ఛాలేంజర్స్‌కు కలిసి రాలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాతి మూడు సీజన్‌లలో బెంగళూరు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.



ఇప్పటికైనా టైటిల్ కలుస్తుందా?

ఐపిఎల్‌లోనే అత్యంత పటిష్టమైన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పేరుంది. కానీ సమష్టిగా రాణించడంలో మాత్రం జట్టు విఫలం అవుతుంది. కనీసం ఈసారైనా బెంగళూరు ఎలాగైన ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ బెంగుళూర్‌కు టైటిల్ అందిస్తాననే ధీమాను వ్యక్తం చేశాడు. అలాగే  ఐఫీఎల్ టైటిల్ గెలిచే ఫెవరెట్ టీంలలో ఆర్సీబీ ఒక్కటన్నారు ఆస్ట్రేలియా మాజీ స్పీన్నర్ బ్రాడ్ హాగ్
Published by: Rekulapally Saichand
First published: July 27, 2020, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading