అలాంటి వారు స్టేడియాల్లోకి రావోద్దు.. బీసీసీఐ కీలక ఆదేశాలు

దేశంలో క్రికెట్‌ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది.

Rekulapally Saichand
Updated: August 4, 2020, 2:08 PM IST
అలాంటి వారు స్టేడియాల్లోకి రావోద్దు.. బీసీసీఐ కీలక ఆదేశాలు
సురేశ్ రైనా
  • Share this:
దేశంలో క్రికెట్‌ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో అన్ని క్రికెట్‌ సంఘాలు ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌వోపీ)ని కచ్చితంగా పాటించాలని బోర్డు సూచించింది. 100 పేజీలతో కూడిన ఎస్‌వోపీ మార్గదర్శకాల్లో పలు స్పష్టమైన సూచనలు చేసింది.

వీటిలొ ముఖ్యమైనది 60 ఏళ్ళు దాటిన వారు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను శిక్షణ శిబిరాల్లోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రాక్టిస్ సెషన్లకు హాజరయ్యే వారు ఎన్‌ఓసీపై సంతకం చేయాలని పేర్కొంది.

శిక్షణ శిబిరానికి హాజరయే ముందు ఆటగాళ్ల గత రెండు వారాల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలి. క్రికెటర్లంతా ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండు సార్లు వైరస్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వస్తేనే క్యాంప్‌లోకి అనుమతిస్తారు. మైదానంలోకి వచ్చేవారు కచ్చితంగా ఎన్‌ 95 మాస్క్‌లు ధరించాలి

ఆటగాళ్ళు తమ సొంత వాహనాల్లోనే మైదానాలకు రావాలి. ఐసీసీ నిబంధనాల ప్రకారం బంతిని పాలిష్‌ చేసేందుకు ఉమ్మి ఉపయోగించడానికి వీలులేదు.

ఇక ఈవెంట్స్ విషయానికి వస్తే కరోనా కారణంగా అన్ని దేశవాళీ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అంతర్గత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు నుంచి ఈవెంట్స్ జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితులలో కొంచం ఆలస్యమయే సూచనలు కనిపిస్తున్నాయి.
Published by: Rekulapally Saichand
First published: August 4, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading