ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ప్లేఆ‌ఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) ఆదివారం ప్రకటించింది.

news18-telugu
Updated: October 26, 2020, 8:18 AM IST
IPL 2020: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
ఐపీఎల్ 2020
  • Share this:
ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ప్లేఆ‌ఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) ఆదివారం ప్రకటించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌లో కేవలం లీగ్‌ దశలో మ్యాచ్‌ల వేదికలను మాత్రమే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ప్లేఆఫ్స్‌ వేదికలని బీసీసీఐ ఆదివారం ఖరారు చేసింది. నవంబర్ 5 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్, అబుదాబి వేదికల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. క్వాలిఫయర్ 1, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను దుబాయ్ వేదిక కానుంది. అలాగే క్వాలిఫయర్ 2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు అబుదాబి వేదికగా నిలవనుంది. అన్ని మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 ప్రారంభం కానున్నాయి.

నవంబర్ 3వ తేదీతో ఈ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అనంతరం పాయింట్ల పట్టికలో టాప్-1, టాప్-2లో నిలిచిన జట్ల మధ్య నవంబర్ 5వ తేదీన క్వాలిఫయర్ 1 జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్-3, టాప్-4లో నిలిచన జట్ల మధ్య నవంబర్ 6వ తేదీని ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు నవంబర్ 8వ తేదీన క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. ఇక, క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2లలో విజయం సాధించిన జట్ల మధ్య నవంబర్ 10వ తేదీన దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది.


ఇక, షార్జాలో నవంబర్ 4 నుంచి 9 వరకు మహిళల టీ 20 చాలెంజ్ నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఇందకోసం ఇప్పటికే మహిళా క్రికెటర్స్ దుబాయ్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం వారు ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక, కరోనా నేపథ్యంలో బీసీసీఐ ఈ ఐపీఎల్ సీజన్‌ను యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 8:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading