csk vs RR : చెన్నై,రాజస్ధాన్ మ్యాచ్‌లో అన్నదమ్ముల సవాల్.. ఫ్యాన్స్‌లో ఆసక్తి

ఐపీఎల్ అంటేనే అభిమానుల్లో ఓ జోష్.. బ్యాటింగ్ మెరుపులు,కళ్ళు చేదిరే క్యాచ్‌లు,వావ్ అనిపించే బౌలింగ్‌తో ఈ టోర్నీ అద్యంతం ఫ్యాన్స్‌ను మైమరిపించేస్తుంది. వేదికగా ఏదైనా.. ఆటగాళ్ళు ఎవారైన ఓన్ చేసుకోవడం ఈ టోర్నీ అభిమానుల ప్రత్యేకత. బరిలోకి దిగక ఎవరని చూడారు.


Updated: September 22, 2020, 9:00 PM IST
csk vs RR : చెన్నై,రాజస్ధాన్ మ్యాచ్‌లో అన్నదమ్ముల సవాల్.. ఫ్యాన్స్‌లో ఆసక్తి
tom curran,,sam-curran
  • Share this:


ఐపీఎల్ అంటేనే అభిమానుల్లో ఓ జోష్.. బ్యాటింగ్ మెరుపులు,కళ్ళు చేదిరే క్యాచ్‌లు,వావ్ అనిపించే బౌలింగ్‌తో ఈ టోర్నీ అద్యంతం ఫ్యాన్స్‌ను మైమరిపించేస్తుంది. వేదికగా ఏదైనా.. ఆటగాళ్ళు ఎవారైన ఓన్ చేసుకోవడం ఈ టోర్నీ అభిమానుల ప్రత్యేకత. బరిలోకి దిగక  ఎవరని చూడారు. ప్రత్యర్ధి ఎంతటి వారైనా లెక్కచేయారు. అనుకున్నది సాధించడమే లీగ్‌లోనే ఆటగాళ్ళ లక్ష్యం. రంగంలోకి దిగరంటే ఆట..ఆటే.. తమ్ముడు.. తమ్ముడే అన్నంట్టుగా ఫ్లేయర్స్ ఆటతీరు ఉంటుంది.

ఇప్పటివరకు క్రికెట్‌లో చాలా మంది బ్రదర్స్ ఆడడం చూశాం. షాన్ మార్ష్-మిచెల్ మార్ష్, ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, మార్క్ వా-స్టీవ్ వా, గ్రెగ్ చాపెల్-ఇయాన్ చాపెల్, దీపక్ చహర్- రాహుల్ చహర్,యూసుఫ్ పఠాన్-ఇర్ఫాన్ పఠాన్, ఉమర్ అక్మల్- కమ్రాన్ అక్మల్, ఆల్బీ మోర్కెల్-మోర్ని మోర్కెల్ లాంటి స్టార్ బ్రదర్స్ తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఒకే జట్టులో..ఒకే దేశానికి ఆడిన అన్నదమ్ములను ఐపీఎల్ ప్రైవెట్ లీగ్స్ ప్రత్యర్ధులుగా మారుస్తున్నాయి. ఇప్పటికి వరకు ఐపీఎల్‌లో చాలా మంది బ్రదర్స్ వేరు,వేరు జట్లలో ఆడారు. ఆన్నదమ్ముల సవాల్‌గా మ్యాచ్‌లు సాగేవి.

ఈ మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో మరో ఇద్దరు సోదరులు  తలబడబోతున్నారు. చెన్నై జట్టులో తమ్ముడు సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్‌ తరఫున అన్న టామ్ కరన్ ఆడనున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అరంభ మ్యాచ్‌లో ఆడిన సామ్ కరన్ మంచి ఆటతీరు కనబర్చాడు. 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి సీఎస్‌కేను గెలుపు దిశగా నడిపించాడు. మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టు తరుపున టామ్ కరన్ . ఈ అన్నదమ్ముల సవాలు ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 22, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading