IPL2020:వాయిదా పడ్డ మరో రెండు సిరీస్‌లు.. ఇక ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్స్ జోరు

Rekulapally Saichand
Updated: August 5, 2020, 3:02 PM IST
IPL2020:వాయిదా పడ్డ మరో  రెండు సిరీస్‌లు.. ఇక ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్స్ జోరు
ఐపీఎల్ ట్రోఫి
  • Share this:
బీసీసీఐకి అన్ని కలిసొస్తున్నాయి . ఇప్పటీకే అసియా కప్,టీ20 వరల్డ్ కప్ వాయిదాతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగుగమం చేసుకున్న బోర్డు..ఇప్పుడు మరో రెండు ఈవెంట్స్ వాయిదాతో ఐపీఎల్‌కు మరింత జోష్ పెంచెందుకు సిద్దమైంది బీసీసీఐ. వాయిదా పడిన సిరీస్‌ల కారణంగా విదేశీ ఆటగాళ్ళు టోర్నీ మెుత్తం కొనసాగే అవకాశం ఉంది. సెప్టెంబర్19 నుంచి నవంబర్ 10 వరకు యుఏఈ వేదికగా ఐపీఎల్ జరగనున్న సంగతి తెలిసిందే.

అయితే అక్టోబర్‌లో ఆసీస్- విండీస్ మధ్య టీ20 సిరీస్‌కు ప్లాన్ చేశాయి ఇరు బోర్డులు. కరోనా విజృంభణ కారణంగా టోర్నీ నిర్వహించడం అసాధ్యమని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను వాయిదా వేసింది. కాగా కరోనాను సాకుగా చూపి ఈ టోర్నీని ఐపీఎల్ కోసమే ఆసీసీ బోర్డు రద్దు చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇక అక్టోబరులో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్‌ కూడా వాయిదా పడటం లాంఛనమే అయింది. అక్టోబరు 11, 14, 17 తేదీల్లోజరగాల్సిన ఈ టీ20 సిరీస్‌ను ఐపీఎల్ కారణంగా వాయిదా వేసింది బీసీసీఐ. ఎలాగైనా డిసెంబర్‌లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య టెస్టు, వన్డే సిరీస్‌ల పాటు టీ20లు కూడా ఉండడంతో వాయిదా అనివార్యం కానుంది. అలాగే శ్రీలంక, జింబాబ్వే పర్యటలను భారత్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది
Published by: Rekulapally Saichand
First published: August 5, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading