ఐపీఎల్ 2020

  • associate partner

నోరుజారిన గవాస్కర్.. ఘాటైన సమాధానం ఇచ్చిన అనుష్క

ఐపీఎల్ 2020కి కామెంటెటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: September 25, 2020, 4:52 PM IST
నోరుజారిన గవాస్కర్.. ఘాటైన సమాధానం ఇచ్చిన అనుష్క
విరాట్, అనుష్క
  • Share this:
ఐపీఎల్ 2020కి కామెంటెటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి పేలవమైన ప్రదర్శనను కనబరిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి రెండు సార్లు క్యాచ్‌లు జారవిడిచాడు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే ఐదు బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అయితే ఈ క్రమంలో కామెంటెటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్.. నోరుజారాడు. కోహ్లి, అనుష్కలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యాలు చేశాడు. "లాక్‌డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లి ప్రాక్టీస్ చేశాడు" అని గవాస్కర్ అన్నాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

గవాస్కర్ చేసిన కామెంట్స్‌పై అనుష్క ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించి ఆమె తన ఇన్‌స్టా స్టోరిలో ఓ పోస్ట్ చేశారు. "మిస్టర్ గవాస్కర్ మీరు చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయనేది నిజం. భర్త ఆటపై మాట్లాడే సమయంలో మీరు అతని భార్య గురించి ఎందుకు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల మీ జీవితంలో ఆట గురించి మీరు కామెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించి ఉంటారు. అదే రకమైన గౌరవాన్ని మీరు నాకు, మా బంధానికి ఇవ్వాలని మీరు అనుకోలేదా?. ఆ మ్యాచ్‌లో నా భర్త ప్రదర్శన గురించి చెప్పడానికి ఎన్నో పదాలు, వాఖ్యలు మీ మనసులో కలిగి ఉంటారని నేను కచ్చితంగా అనకుంటాను.

ఇది 2020 అయినా నాకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. క్రికెట్ విషయంలో నన్ను లాగడం ఎప్పుడు మానేస్తారు? నాపై అసభ్యకర కామెంట్లు చేయడం ఎప్పుడు వదిలేస్తారు? గవాస్కర్ గారు మీరోక లెజెండ్..క్రికెట్‌లలో మీ ఖ్యాతి ఎంతో గొప్పది. మీరు అన్న మాటల వల్ల నేను ఎంత బాధను అనుభవించాలనో.. మీకు చెప్పాలని అనుకున్నాను"అని అనుష్క పేర్కొన్నారు. ఇక, గతంలో కూడా కోహ్లి పేలవమైన ప్రదర్శించిన సమయంలో సోషల్ మీడియాలో అనుష్కపై అనుచిత కామెంట్స్ చేసిన సంగతి లెలిసిందే.


2017లో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే ప్రేమలో ఉన్న ఈ జంట.. పెళ్లి తర్వాత కూడా అదే ప్రేమను కొనసాగిస్తున్నారు. త్వరలో విరుష్క జోడి తల్లిదండ్రులు కాబోతున్నారు. అనుష్క గర్భవతి అనే విషయాన్ని కొద్ది రోజుల కిందటే కోహ్లి సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Published by: Sumanth Kanukula
First published: September 25, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading