ఐపీఎల్ 2020

  • associate partner

IPL:ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా అమోజన్?.. సంస్థకు కలిసిరానున్న పండుగల సీజన్

వివో టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. స్పాన్సర్ రేసులో పలు కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.

Rekulapally Saichand
Updated: August 7, 2020, 6:31 PM IST
IPL:ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా అమోజన్?.. సంస్థకు కలిసిరానున్న పండుగల సీజన్
AMAZON IPL
  • Share this:
వివో టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. స్పాన్సర్ రేసులో పలు కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. IPL 2020కి స్పాన్సర్‌షిప్ అందించేందుకు ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్,బైజూస్‌, మై స‌ర్కిల్ 11, అన్ అకాడ‌మీ, డ్రీమ్ 11 త‌దిత‌ర సంస్థలు రేసులో నిలిచాయి. అన్నింటి క‌న్నా అమెజాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వ‌ర్గాలు వివరించాయి.

స్పాన్సర్‌‌షిప్ దక్కించుకునేందుకు అమోజన్ వ్యూహాత్మాకంగా ముందుకు వెళుతోంది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో దసరా,దీపావళీ పండుగలు వస్తుంది. ఆ టైంలో స‌హ‌జంగానే షాపింగ్ ఎక్కువ‌గా జ‌రుగుతుంది. అందువ‌ల్ల అమెజాన్ ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్ ఉంటే భారీగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఇతర సంస్ధలు కూడా బిడ్ దక్కించుకునేందుకు పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.వివో వ‌ల్ల కోల్పోయిన రూ.440 కోట్లలలో 3వ వంతు.. అంటే రూ.180 కోట్లు వ‌చ్చినా చాలని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆలోచిస్తోంది.

చైనా ఇండియాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా డ్రాగన్ కంట్రీపై భారత్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వెళ్ళగక్కేలా చేసింది. దీంతో ప్రజా ఆగ్రహానికి జడిసిన చైనా మోబైల్ దిగ్గజం వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ తప్పుకుంది. కరోనా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి ఈ నిర్ణయం మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
Published by: Rekulapally Saichand
First published: August 7, 2020, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading