Home /News /ipl /

AHEAD OF IPL 2020 ICE COOL MS DHONI LOOKS FOCUSED CSK SHARES PHOTO SA

IPL 2020: ఐపీఎల్ సమీపిస్తోంది... అందరి కళ్లూ అతని పైనే

సీఎస్‌కే టీమ్

సీఎస్‌కే టీమ్

ఐపీఎల్ 2020 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీపై పడింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, ధోనీ ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన ఆటడాడి గేమ్ను చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు.

    ఐపీఎల్ 2020 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీపై పడింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, ధోనీ ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన ఆటడాడి గేమ్ను చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా అదడు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను మంగళవారం చెన్నై సూపర్కింగ్స్ ట్టిట్టర్లో పోస్ట్ చేసింది. ధోనీ ఆటను చూడటానికి మీతో పాటు మేము కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం అంటూ ఒక ట్యాగ్ను కూడా జతచేసింది.

    ధోనీ సారథ్యంలోనే చెన్నై మూడు సార్లు ఐపీఎల్ కప్పు అందుకుంది. చెన్నై జట్టులో మిస్టర్ కూల్ ధోనీ కీలక ఆటడాడు. గత కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్న ధోనీ కొద్ది రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్లూ జెర్సీలో తమ అభిమాన ఆటగాడిని చూసే అవకాశం లేదని బాధపడేలోపే ఫ్యాన్స్కు ఐపీఎల్ రూపంలో ధోనీ ఆటను చూసే అవకాశం వచ్చింది. ఈసారి కూడా చెన్నై విజయాలలో ధోనీ కీలకపాత్ర పోషించనున్నాడు. టోర్నీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా చెన్నై నిలిచిందంటే అందుకు కారణం కెప్టెన్ కూల్ అనడంలో ఆశ్చర్యం లేదు.

    సీఎస్కే పోస్ట్ చేసిన ఫొటోలో ధోనీ తనమీదికి దూసుకొస్తున్న బంతిని తీక్షణంగా చూస్తూ కూల్గా షాట్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. మిస్టర్ కూల్ యాట్టిట్యూడ్కు తగ్గట్లు ఉన్న ఈ ఫొటోకు అభిమానుల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ధోని మళ్లీ బ్యాట్ పట్టడం కచ్చితంగా అతడి అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది.

    ఈ సంవత్సరం ఐపీఎల్ సెప్టెంబర్ 19 న అబుదాబిలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్లు చెన్నై, ముంబై తలపడనున్నాయి. టైటిల్ కౌంట్లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నైకంటే ముందు ఉంది. గతేడాది జులైలోనే ధోనీ ఆఖరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్తో జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీస్ తరువాత అతడు మళ్లీ బ్యాట్ పట్టేది ఈ ఐపీఎల్లోనే. ఇంత గ్యాప్ తరువాత ధోని ఎలా ఆడతాడా అని క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

    సెప్టెంబర్ ఆరున 13వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్ వెలువడింది. టోర్నమెంట్ ఈసారి యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా నగరాల్లో జరగనుంది. కరోనా నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆటగాళ్లు కూడా కొవిడ్-19 మార్గదర్శకాలు, బయో సెక్యూర్డ్ బబుల్ నిబంధనలకు అనుగుణంగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. తమ జట్టులో కొందరు ఆటగాళ్లు కరోనా భారిన పడటంతో చెన్నై యాజమాన్యం మరిన్నికట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Chennai Super Kings, IPL 2020, Ms dhoni, UAE

    తదుపరి వార్తలు