IPL 2020: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంతోషంలో ఫ్రాంచైజీలు

ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త మరింత ఉత్సహనిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెటర్లు క్వారంటైన్‌లో ఎన్ని రోజులు ఉండాలన్న విషయంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.


Updated: September 18, 2020, 2:00 PM IST
IPL 2020: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంతోషంలో ఫ్రాంచైజీలు
IPL FANS
  • Share this:
ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త మరింత ఉత్సహనిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెటర్లు క్వారంటైన్‌లో ఎన్ని రోజులు ఉండాలన్న విషయంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారంగా ఆటగాళ్ళు ఆరు రోజులు క్వరెంటైన్‌లో ఉండాలి. ఈ నింబంధన ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారింది. ఆరంభ మ్యాచ్ నుంచే ఆ ఇరు దేశాల క్రికెటర్లను ఆడించాలని చూస్తున్నయాజమాన్యలకు క్యారంటైన్ రూల్స్ అడ్డుగా మారాయి. అయితే చివరకు ప్రాంఛైజీలు,ఆటగాళ్ళ విజ్ఞప్తి మేరకు రూల్స్‌ను సడలించారు. 6 గంటలు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటే చాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఆసీస్,ఇంగ్లాండ్ మధ్య ఇటీవలే టి20, వన్డే సిరీస్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగా వారు కాస్త లేటుగా యుఏఈకి చేరుకోవాల్సి వచ్చింది.ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన వల్ల ఆ రెండు దేశాల ఫ్లేయర్స్ జట్టులో అలస్యంగా జాయిన్ అవాల్సివస్తోంది. ఇది ఆటగాళ్ళు,జట్టుకు ఇబ్బంది కలిగించే ఆంశం. ఎందుకంటే దాదాపు అన్ని టీంలలో స్టార్ ఆటగాళ్ళ ఆసీస్,ఇంగ్లాండ్ దేశాల నుంచే ఉన్నారు. ఆరంభ మ్యాచ్‌లలో వీరు లేకుంటే ఈవెంట్ కళ తప్పే అవకాశం ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సడలించారు నిర్వహకులు.
Published by: Rekulapally Saichand
First published: September 18, 2020, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading