Zelensky Fires Kharkiv Security Chief : ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర(Russia-Ukraine War)ప్రారంభమైన తర్వాత..తొలిసారిగా యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పర్యటించారు. ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో రెచ్చిపోతున్న రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని తూర్పు నగరాలపై విధ్వంసం సృష్టించాయి. దీంతో దెబ్బతిన్న ఖార్కివ్ ప్రాంతాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. ఖార్కివ్‌లోని పరిసరా ప్రాంతాలన్ని చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని జెలెన్ స్కీ అన్నారు. ఖార్కివ్‌ను సందర్శించిన తర్వాత ఆ ప్రాంతం యొక్క భద్రతా చీఫ్‌ని తొలగించినట్లు జెలెన్స్కీ ప్రకటించాడు. "పూర్తి స్థాయి యుద్ధం యొక్క మొదటి రోజుల నుండి నగరాన్ని రక్షించడానికి పని చేయనందుకు, తన గురించి మాత్రమే ఆలోచించినందుకు" ఆ వ్యక్తిని తొలగించబడ్డాడని మరియు ఇతరులు "చాలా ప్రభావవంతంగా" శ్రమించగా, మాజీ చీఫ్ అలా చేయలేదని జెలెన్స్కీ చెప్పాడు.
అయితే అధ్యక్షుడు ఆ అధికారి పేరు చెప్పనప్పటికీ, ఉక్రేనియన్ మీడియా నివేదికలు అతన్ని ఖార్కివ్ ప్రాంతం యొక్క SBU భద్రతా సేవ అధిపతి రోమన్ డుడిన్గా గుర్తించాయి. అంతకుముందు, ఖార్కివ్ మరియు దాని పరిసరాలలో ధ్వంసమైన భవనాలను వీక్షిస్తున్నప్పుడు అధ్యక్షుడు బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించి ఉన్న వీడియోను జెలెన్స్కీ కార్యాలయం టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ALSO READ Viral Video : తనకే ఓటు వేయాలని..బైక్ పై ఇంటింటికి తిరిగిన సీఎం
ఇక,ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని స్వాధీనం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ఖార్కివ్ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గి తూర్పు డోన్బాస్ ప్రాంతం నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని తూర్పువైపు దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. ఐతే జెలెన్ స్కీ మాత్రం చివరి వరకు మా దేశాన్ని రక్షించుకుంటామని పునరుద్ఘాటించటం విశేషం. అంతేకాదు ఖార్కివ్ ప్రాంతంలోని మూడో వంతు రష్యా అధినంలో ఉంది. పైగా రష్యా దళాల బాంబుల వర్షంతో విరుచుకుపడటంతో అక్కడ పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. వేలాదిమంది పౌరులు చనిపోవడమే కాకుండా ఆ ప్రాంతాలకు వెళ్లడం కూడా కష్టతరంగా ఉందని స్థానిక గవర్నర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ ఆయుధ డిపోలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని క్రెయిన్వాసులు తాగు నీరు లేక, ఆహారం కొనగోలు చేసేందుకు డబ్బులు లేక అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు. దీంతో జెలెన్స్కీ ధ్వంసమైన ప్రాంతాలను పునర్మించే దిశగా స్థానిక అధికారులతో ప్రణాళికా చర్చలు జరిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War, Zelensky