ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన యూట్యూబ్... యూజర్ల అవస్థలు..!

మంగళవారం రాత్రి సుమారు 9 గంటల నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్లే కాలేదు. ఏవీడియో క్లిక్ చేసిన ఇంజినీర్స్ ఆర్ డీలింగ్ విత్ ద ఇష్యూ అంటూ మెసేజ్ చూపించింది.

news18-telugu
Updated: October 17, 2018, 9:05 AM IST
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన యూట్యూబ్... యూజర్ల అవస్థలు..!
స్నాప్‌చాట్ లాంటి ఫీచర్ యూట్యూబ్‌లో..., (Image: Reuters)
  • Share this:
యూట్యూబ్... ఈ మధ్య కాలంలో కామన్ మ్యాన్‌కి సైతం చాలా దగ్గరైంది. ఏ సినిమా చూడాలన్నా...ఏ సాంగ్ వినాలన్న యూట్యూబ్‌లోకి వెళ్లి సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతినెల యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండే యూజర్ల సంఖ్య దాదాపుగా రెండుకోట్లు వరకు ఉంటారు. అలాంటి యుట్యూబ్ మంగళవారం క్రాష్ అయ్యింది. రాత్రి నుంచి జనాలకు చుక్కలు చూపించింది. ఏ వీడియో క్లిక్ చేసినా... ఓపెన్ కాలేదు. దీంతో యూజర్లు చిర్రెత్తుకుపోయారు.

మంగళవారం రాత్రి సుమారు 9 గంటల నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్లే కాలేదు. ఏవీడియో క్లిక్ చేసిన ఇంజినీర్స్ ఆర్ డీలింగ్ విత్ ద ఇష్యూ అంటూ మెసేజ్ చూపించింది. ఇలా మనదేశంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా కూడా యూట్యూబ్ డౌన్ అయ్యింది. దీంతో నెటిజన్ల అంతా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఏ వీడియో ప్లే చాయాలనుకున్నా... ఏన్ ఎర్రర్ అక్కరడ్, ప్లీజ్ ట్రై ఎగైన్, సారీ దట్ వీడియో డజ్ నాట్ ఎగ్జిస్ట్ అంటూ.. మెసేజ్‌లు కనిపించాయి. దీంతో యూట్యూబ్ యూజర్లంతా ఇబ్బందులు పడ్డారు.

యుట్యూబ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందించింది యాజమాన్యం.ట్విట్టర్లో మెసేజ్ పోస్టు చేసింది. యూజర్లకు అందరికీ యూట్యూబ్ క్షమాపణలు చెప్పింది. యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్ , యూట్యూబ్‌లో సమస్యలు తలెత్తాయని,.. వాటిని తొందర్లోనే... పరిష్కరిస్తామని చెప్పుకొచ్చింది. తీవ్ర అసౌకర్యానికి గురైనందకు గాను యూజర్లకు అపాలజీ చెప్పింది. సాంకేతిక సమస్యను పరిష్కరించామని ప్రకటించింది. మొత్తం మీద... ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు కొన్నిగంటలపాటు నిలిచిపోవడంతో ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా ఫీల్ అయ్యారు నెటిజన్లు.

Published by: Sulthana Begum Shaik
First published: October 17, 2018, 8:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading