యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు గూగుల్ ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇకపై యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించే సొమ్ముకు పన్ను కట్టాల్సిందేనని పేర్కొంది. ఇది భారతదేశంతో పాటు ఇతర దేశాల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవలి కాలంలో యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించుకోవడం చాలా కామన్‌గా మారింది. పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గరి నుంచి సాధారణ వ్యక్తుల వరకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. కొంతమంది కేవలం యూట్యూబ్ ఛానళ్ల ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే, ఇకపై యూట్యూబ్ ద్వారా ఇలా పెద్ద మొత్తంలో సంపాదించడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, ఒక యూట్యూబ్ ఛానల్‌కు అమెరికా వ్యూస్ ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను విధించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన 2021 జూన్ నుండి అమల్లోకి రానుంది.
సాధారణంగా యూట్యూబ్ సబ్‌స్కైబర్లను బట్టి ఆయా చానెళ్లకు యాడ్స్ ఇస్తుంటాయి కంపెనీలు. వీటివల్లే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు డబ్బులు వస్తాయి. యూజర్లు యాడ్స్ స్కిప్ చేయకుండా చూస్తే మరింత ఆదాయం వస్తుంది. అంతేకాక, యూట్యూబ్ ఛానల్‌కు ఉండే సబ్‌స్కైబర్లు వారి కంటెంట్‌ను ఎన్ని నిమిషాలు చూశారనే విషయాల మీద కూడా ఆదాయం ఆధారపడి ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయం అదనం అని చెప్పవచ్చు. వీటితో పాటు సూపర్ ఛాట్, సూపర్ స్టిక్కర్లు, ఛానల్ మెంబర్షిప్ ద్వారా కూడా యూట్యూబ్ ఛానళ్లకు గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. అయితే, తాజా రూల్ ప్రకారం యూట్యూబ్ నిర్వాహకులు ఇకపై అమెరికా యూట్యూబ్ వ్యూవర్స్ ద్వారా వచ్చే ఆదాయం నుంచి 15 శాతం పన్నును అమెరికాకు చెల్లించాలి. అందుకోసమే పన్ను వివరాలకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా సమర్పించాలంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులకు మెయిల్స్ పంపిస్తోంది గూగుల్ సంస్థ. మీ పన్ను సమాచారాన్ని 2021 మే 31 నాటికి అందించకపోతే, మీ యూట్యూబ్ ఛానెల్‌కు వచ్చే మొత్తం ఆదాయంలో 24% వరకు గూగుల్ కోత విధించనున్నట్లు తెలిపింది.
ఎంత శాతం పన్ను చెల్లించాలి?
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌కు ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి వారికి ఎంత పన్ను విధించబడుతుందనే విషయం ఆధారపడి ఉంటుంది. అమెరికా వెలుపల ఉన్న కంటెంట్ క్రియేటర్స్ తమ పన్ను సమాచారాన్ని సమర్పించడం ద్వారా అమెరికా వీక్షకుల నుండి సంపాదించే మొత్తం ఆదాయంపై 0 నుండి-30% వరకు మినహాయింపు పొందవచ్చు. ఒక వేళ మీ పన్ను సమాచారాన్ని ఇవ్వకపోతే డిఫాల్ట్‌గా 30 శాతం మీ యూట్యూబ్ ఆదాయానికి గండి పడుతుంది. కాబట్టి, మీ యూబ్యూట్ ఛానెల్‌కు అమెరికా వీక్షకులు ఎక్కువగా ఉంటే వారి నుంచి వచ్చే ఆదాయంలో కోతకు సిద్ధంగా ఉండండి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.