ఏడాది కిందట పోయిన ఉంగరం... ఇప్పుడు దొరికింది. ఎలా..?

పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికితే... అప్పుడు కలిగే ఆనందమే వేరు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ముఖ్యంగా పురాతనమైన, అరుదైనవి తిరిగి దొరికితే ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 10:29 AM IST
ఏడాది కిందట పోయిన ఉంగరం... ఇప్పుడు దొరికింది. ఎలా..?
తిరిగి దొరికిన రింగ్ (Image : FB - Tiny Bordeaux)
  • Share this:
న్యూయార్క్ స్టేట్ హావిలాండ్ కోవ్ బీచ్‌లో తిరుగుతూ ఓ యువకుడు తన చేతి ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. అది తనకు ఎంతో ఇష్టమైన రింగ్. చూడ్డానికి కూడా అరుదైనదిలా ఉంటుంది. అది పోయిన రోజున తనను తానే తిట్టుకుంటూ... అదే బీచ్ అంతా తిరుగుతూ వెతికాడు. అది దొరకలేదు. దాదాపు వారం పాటూ వేట సాగించాడు. అయినా ఫలితం లేకపోయింది. ఇక అది దొరకదులే అని అనుకుంటూ... దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నించాడు. ఐతే... ఏడాది తర్వాత క్రైగ్ టైనీ బోర్డియాక్స్ అనే మరో వ్యక్తి... మెటల్ డిటెక్టర్‌తో బీచ్‌లో వెతుకుతుంటే... ఇసుకలో మూసుకుపోయిన రింగ్ దొరికింది. అది చూడ్డానికి కాస్త చిత్రంగా ఉండటంతో... దాన్ని ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు క్రైగ్ టైనీ. జస్ట్ 12 గంటల్లోనే ఆ పోస్ట్‌ను 2వేల మందికి పైగా షేర్ చేశారు.

viral news,news,breaking news,viral news today,viral video,latest news,viral,world news,tv news,india news,top viral videos,top viral news,వైరల్ న్యూస్,న్యూయార్క్,అమెరికా,తెలుగు వార్తలు, తెలుగు న్యూస్,
తిరిగి దొరికిన రింగ్ (Image : FB - Tiny Bordeaux)


ఈ పోస్ట్‌ని ఏడాదికి కిందట రింగ్ పోగొట్టుకున్న యువకుడు కూడా చూశాడు. అది తనదేనని క్రైగ్ టైనీకి చెప్పాడు. అలా వాళ్లిద్దరూ మాట్లాడుకోవడంతో... తిరిగి రింగ్... దాని ఓనర్‌ని చేరింది.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు