• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • YOU HAVE NO FUTURE NO PARTY ANYMORE PML N VICE PRESIDENT MARYAM NAWAZ WARNS PM IMRAN KHAN HSN

Imran Khan- Maryam Nawaz: నీ పార్టీ కనుమరుగవబోతోంది.. నీ భవిష్యత్ అంథకారమే.. ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగిన మరియం నవాజ్

Imran Khan- Maryam Nawaz: నీ పార్టీ కనుమరుగవబోతోంది.. నీ భవిష్యత్ అంథకారమే.. ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగిన మరియం నవాజ్

ఇమ్రాన్ ఖాన్, మరియం నవాజ్ (ఫైల్ ఫొటోలు)

’నీకు రాజకీయ భవిష్యత్ అంతం కాబోతోంది. నీ పార్టీ కనుమరుగు అవబోతోంది. ఈ విషయం నీతో పాటు ఉన్న నీ అనుచరులకు, నీ పార్టీ సభ్యులందరికీ తెలుసు. మా పార్టీని చీల్చడానికి ప్రయత్నించిన వాళ్లు విచ్ఛిన్నమవక తప్పదు‘ అంటూ..

  • Share this:
    ’నీకు రాజకీయ భవిష్యత్ అంతం కాబోతోంది. నీ పార్టీ కనుమరుగు అవబోతోంది. ఈ విషయం నీతో పాటు ఉన్న నీ అనుచరులకు, నీ పార్టీ సభ్యులందరికీ తెలుసు. మా పార్టీని చీల్చడానికి ప్రయత్నించిన వాళ్లు విచ్ఛిన్నమవక తప్పదు‘ అంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) వైస్ ప్రెసిడెంట్ మరియం నవాజ్ నిప్పులు చెరిగారు. పార్టీ కౌన్సిల్ సమావేశంలో గురువారం మాట్లాడిన ఆమె పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశం మేరకు సెనేట్ ఎన్నికల్లో పీపీపీ పార్టీ నేత యూసఫ్ రజా గిలానీకి ఓటేసి, ఆయన గెలుపునకు కారణమయిన వారందరినీ పేరుపేరునా అభినందించారు. సెనేట్ ఎన్నికల్లో డాక్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్ పై పోటీ చేసి పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ మద్దతుతో గిలానీ విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మరియం నవాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

    ’పాకిస్తాన్ రాజకీయాల్లో మా నాన్న, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ ట్రెండ్ సెట్టర్. పాక్ అభివృద్ధి కోసం ఆయన నిత్యం తపించారు. ఆయన పాటించిన విలువలు, ఆయన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం నా ఒక్కదాని వల్ల కాదు. పార్టీ కార్యకర్తలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. సెనేట్ ఎన్నికల్లో ఓడిపోతానని ఇమ్రాన్ ఖాన్ కు ముందే తెలుసు. అయినప్పటికీ ఆర్డినెన్స్ ల ద్వారా, సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలనుకున్నారు. మన పార్టీని చీల్చాలనుకున్నారు. కానీ అంతిమ విజయం మనదే అయింది‘ అని మరియం నవాజ్ చెప్పుకొచ్చారు.

    గతంలో ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ సభ్యులు ఉన్నప్పటికీ సెనేట్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రిగ్గింగ్ చేసి మీరు గెలిచినప్పుడు మీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నిద్రపోతోందా? అని మరియం నవాజ్ నిలదీశారు. రిగ్గింగ్ చేసి గెలిచారంటూ మంత్రులు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీ పార్టీలోని నేతలకే మీ పట్ల నమ్మకం లేదనీ, విశ్వాస పరీక్షకు ఇమ్రాన్ ఖాన్ వెళ్లాలని ఆమె సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) గెలుపు తథ్యమని ఆమె వ్యాఖ్యానించారు.
    Published by:Hasaan Kandula
    First published: