NASA to ISRO : ఇస్రోతో కలిసి పనిచేస్తాం... నాసా ప్రకటన

Chandrayaan-2 : ఇతర గ్రహాలపై నాసా చేస్తున్న ప్రయోగాలతో పోల్చితే... ఇస్రో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నట్లు లెక్క. ఇలాంటి సమయంలో... నాసా నుంచీ వచ్చిన ప్రకటన... ఇస్రో శాస్త్రవేత్తల్లో మరింత మనోధైర్యాన్ని నింపింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 6:14 AM IST
NASA to ISRO : ఇస్రోతో కలిసి పనిచేస్తాం... నాసా ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 6:14 AM IST
NASA to ISRO on Chandrayaan-2 : చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ప్రయోగం జరిగినప్పుడు దాని గురించి ప్రపంచమంతా మాట్లాడుకున్నా... అమెరికా అంతరిక్ష పరిశోధన నాసా మాత్రం స్పందించలేదు. ఇది ఇస్రోతోపాటూ... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే... సిగ్నల్స్ మిస్సైన విక్రమ్ ల్యాండర్‌ను మర్నాడే కనిపెట్టడంతో... వెంటనే నాసా కూడా స్పందించింది. చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపాలని... ఇస్రో చేసిన ప్రయత్నం ప్రశంసనీయం అని మెచ్చుకుంది. నిజానికి... జులైలో ఇస్రో... చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టినప్పుడు కూడా నాసా ఇలాగే స్పందించింది. అప్పట్లో ఇస్రోకి శుభాకాంక్షలు తెలిపిన నాసా... చంద్రుడి దక్షిణ ధ్రువ విశేషాలపై చంద్రయాన్-2 ఎలాంటి సమాచారం అందించబోతుందోనన్న ఆసక్తితో మున్ముందు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.

ఇకపై ఇస్రోతో కలిసి అంతరిక్ష పరిశోధనలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని నాసా ప్రకటించింది. అంతేకాదు... అంతరిక్ష ప్రయోగాలు ఎంతో కష్టంగా ఉంటాయన్న విషయాన్ని స్పష్టం చేసింది. చంద్రుడి దక్షిణ ఉపరితలంపైకి ల్యాండర్ వెళ్లిన తీరు తమకెంతో స్ఫూర్తిని ఇచ్చిందనీ, భవిష్యత్తులో ఇస్రోతో కలసి... అంతరిక్షంలోని ఎన్నో రహస్యాల్ని వెలుగులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాసా వివరించింది. భవిష్యత్తులో ప్రపంచానికి ఉపయోగపడే సమాచారాన్ని ఇండియా ఇవ్వగలదనే ఆశాభావాన్ని నాసా వ్యక్తం చేసింది.

ప్రపంచాన్ని అలర్ట్ చేసిన ఇస్రో : నిజానికి అంతరిక్షంలో వందల కొద్దీ శాటిలైట్లను సురక్షితంగా, విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రోకి చంద్రయాన్-2 అనేది చాలా చిన్న విషయం కిందే లెక్క. అలాంటిది... ఈ ప్రాజెక్టును ఇస్రో పూర్తి సంతృప్తితో చెయ్యలేకపోవడాన్ని బట్టీ చూస్తే... చంద్రమామపై ప్రయోగాలు అంత ఈజీ కాదన్న విషయం మరోసారి బయటపడింది. త్వరలో అమెరికా, చైనా సహా చాలా దేశాలు చందమామపై బోలెడు ప్రయోగాలు చేసేయాలనీ, కాలనీలు నిర్మించేయాలనీ ప్లాన్స్ వేసుకుంటున్నాయి. ఐతే... ఏ ప్లాన్లైనా జాగ్రత్తగా వ్యవహరించకపోతే... డేంజరేననే విషయం చంద్రయాన్-2 ద్వారా స్పష్టమైంది. అత్యంత జాగ్రత్తగా ఉండే ఇస్రోకే సాధ్యం కానిది... తమకు మాత్రం ఎలా సాధ్యమవుతుందని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఆలోచనలో పడ్డారు. చందమామను అంత తేలిగ్గా అంచనా వెయ్యకూడదనీ, అక్కడ ఏం చెయ్యాలన్నా బాగా ఆలోచించి చెయ్యాలనే అభిప్రాయానికి వచ్చాయి. ప్రపంచ దేశాలు ఇస్తున్న ప్రోత్సాహంతో... ఇస్రో శాస్త్రవేత్తలు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...