Powerful Passports: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గల దేశాలివే.. ఇక్కడికి వీసా లేకున్నా వెళ్లొచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్పోర్ట్తో పాటు వీసా అవసరమన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని దేశాలు మాత్రం పరస్పర ఒప్పందాల్లో భాగంగా కేవలం పాస్పోర్ట్(Passport)తో కూడా వారి దేశాలకు అనుమతిస్తాయి.

  • News18
  • Last Updated :
  • Share this:
2020 సంవత్సరం కరోనా ప్రభావంతో అంతర్జాతీయ ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్డౌన్(Lockdown) అమలు చేశాయి. కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో సుదీర్ఘకాలం తర్వాత ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తూ వస్తున్నాయి. అయితే, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలోనే యూకేలో కొత్త రకం కరోనా వైరస్(Corona virus) విజృంభించడంతో, భారత్ తో సహా అనేక దేశాలు యూకేకు విమాన రాకపోకల(Air Travel)పై నిషేధం విధించాయి. అయితే, కొన్ని దేశాలు మాత్రం ఇతర దేశాలకు వెల్లడానికి, ఇతర దేశాల వారిని తమ దేశంలోకి రావడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని వారిని అనుమతిస్తున్నాయి.

సాధారణంగా ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్పోర్ట్తో పాటు వీసా అవసరమన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని దేశాలు మాత్రం పరస్పర ఒప్పందాల్లో భాగంగా కేవలం పాస్పోర్ట్(Passport)తో కూడా వారి దేశాలకు అనుమతిస్తాయి. కరోనా విపత్కర సమయంలోనూ 2021లో కొన్ని దేశాలు కేవలం పాస్పోర్ట్తోనే వారి దేశాల్లోకి అనుమతించాలని నిర్ణయించాయి. ఏఏ దేశాలు వీసా లేకుండా పాస్పోర్ట్(Passport)తోనే అనుమతిస్తున్నాయనే దానిపై హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index) నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో జపాన్(Japan) అగ్రస్థానంలో నిలిచింది.

స్నేహపూర్వక పాస్పోర్ట్ విధానం అమలు చేస్తున్న దేశాల జాబితాలో జపాన్(japan) అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా 191 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది. కాగా, 190 గమ్యస్థానాలతో సింగపూర్ (Singapore)ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. 189 గమ్యస్థానాల(Destinations)తో దక్షిణ కొరియా(South Korea), జర్మనీ(Germany) మూడవ స్థానాల్లో నిలిచాయి. వీసా(visa) లేకుండానే కేవలం పాస్పోర్ట్ తో అనేక దేశాలు అనుమతిస్తున్నాయి.

7వ స్థానంలో నిలిచిన యూకే, అమెరికా..
ప్రస్తుతం, కరోనావైరస్ కేసుల సంఖ్య యుఎస్(United States), యుకె(United Kingdom) రెండు దేశాల్లో బాగా పెరుగుతున్నాయి, కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తికి యుకె కేంద్రంగా ఉంది. అందువల్ల, యూకె విమాన రాకపోకలపై తాత్కాలిక ప్రయాణ ఆంక్షలు విధించింది. వాస్తవానికి, అమెరికా పాస్పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 75 కన్నా తక్కువ గమ్యస్థానాలకు మాత్రమే ప్రయాణించగలుగుతున్నారు. యుకె పాస్పోర్ట్ హోల్డర్లు 70 కన్నా తక్కువ గమ్యస్థానాలకు మాత్రమే యాక్సెస్ కలిగి ఉన్నారు. ఇక -యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) 173 గమ్యస్థానాలకు వీసా రహిత / వీసా -ఆన్- ఎరైవల్ యాక్సెస్తో 16వ స్థానంలో నిలిచింది. ఈ దేశం 2006లో కేవలం 35 మందికి యాక్సెస్ కల్పించి 62వ స్థానంలో ఉండేది. ఈ జాబితాపై హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ చైర్ పర్సన్ క్రిస్టియన్ హెచ్. కెయిలిన్(Christian H. Kaelin) మాట్లాడుతూ "ప్రతి ఏడాది ప్రపంచ జనాభాలో చైతన్యం, ప్రయాణ స్వేచ్ఛ పెరుగుతుంది. తద్వారా, శక్తివంతమైన పాస్పోర్టులు కలిగి ఉన్నవారు గతంలో కంటే ఎక్కువ దేశాలకు యాక్సెస్ పొందగలుగుతున్నారు." అని అన్నారు.

2021లో ఒక్క పాస్పోర్ట్ తోనే ఎక్కువ గమ్యస్థానాలకు అనుమతించే దేశాలు
1. జపాన్ (191 గమ్యస్థానాలు)
2. సింగపూర్ (190)
3. దక్షిణ కొరియా, జర్మనీ (189)
4. ఇటలీ, ఫిన్లాండ్, స్పెయిన్, లక్సెంబర్గ్ (188)
5. డెన్మార్క్, ఆస్ట్రియా (187)
6. స్వీడన్, ఫ్రాన్స్, పోర్చుగల్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ (186)
7. స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, బెల్జియం, న్యూజిలాండ్ (185)
8. గ్రీస్, మాల్టా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా (184)
9. కెనడా (183)
10. హంగరీ (181)

పాస్పోర్ట్ తో అత్యంత తక్కువ గమ్యస్థానాలకు అనుమతించే దేశాలు
ప్రపంచంలోని కొన్ని దేశాలు కేవలం 40 కంటే తక్కువ దేశాలకు మాత్రమే వీసా రహిత, వీసా ఆన్ ఎరైవల్ యాక్సెస్ను కల్పిస్తున్నాయి. వాటిపై ఓలుక్కేయండి.
1. ఉత్తర కొరియా (39 గమ్యస్థానాలు)
2. లిబియా, నేపాల్ (38)
3. పాలస్తీనా భూభాగాలు (37)
4. సోమాలియా, యెమెన్ (33)
5. పాకిస్తాన్ (32)
6. సిరియా (29)
7. ఇరాక్ (28)
8. ఆఫ్ఘనిస్తాన్ (26)
Published by:Srinivas Munigala
First published: