Home /News /international /

YEMEN AIR STRIKES AT LEAST 100 KILLED10 CHILDREN DEAD IN YEMEN AIR RAIDS INTERNET BLACKOUT REPORTED SK

Yemen Air Strikes: జైలుపై బాంబుల వర్షం.. యెమెన్‌లో 100 మందికి పైగా మ‌ృతి

జైలుపై బాంబుల వర్షం

జైలుపై బాంబుల వర్షం

Yemen Airstrikes: జైలు ఆవరణలో భీతావహ వాతవరణం కనిపించింది. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిఉన్నాయి. కొందరి కాళ్లు చేతులు తెగిపడడంతో హాహాకారాలు చేశారు.

  యెమన్ (Yemen), సౌదీ అరేబియా (Saudi Aarabia) నేతృత్వంలోని సంకీర్ణ దేశాల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా యెమెన్‌లోని సాదా జైలుపై సౌదీ సంకీర్ణ బలగాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఆ జైలుపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించినట్లు యెమన్‌లోని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఒమర్ వెల్లడించారు. మృతుల్లో పలువురు చిన్నారులు, ఆఫ్రికా వలదారులు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం అక్కడి దృశ్యాలను హౌతీలు విడుదల చేశారు. జైలు ఆవరణలో భీతావహ వాతవరణం కనిపించింది. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిఉన్నాయి. కొందరి కాళ్లు చేతులు తెగిపడడంతో హాహాకారాలు చేశారు. కాపాడమంటూ ఆర్తనాదాలు చేశారు. బాంబు దాడుల్లో గాయపడిన క్షతగాత్రులను రెడ్ క్రాస్ ప్రతినిధులు ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించారు.

  Watching TV: ఎక్కువ సేపు టీవీ చూస్తున్నారా? చాలా డేంజర్.. రక్తం గడ్డకట్టే ప్రమాదం

  యెమెన్‌లోని తీరప్రాంత నగరం హౌడైదాలో కూడా మరో వైమానిక దాడి జరిగింది. టెలి కమ్యూనికేషన్ కేంద్రాన్ని టార్గెట్ చేసుకొని బాంబులను వేశారు. ఈ ఘటనలో అక్కడే ఆడుకుంటున్న పలువురు చిన్నారులు మరణించారు. ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో పిల్లలు ఆడుకుంటున్న సమయంలోనే క్షిపణులు పడ్డాయి. ఈ బాంబు దాడిలో టెలీకమ్యూనికేషన్ సెంటర్ ధ్వంసంమవడంతో.. యెమెన్‌లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. యెమెన్ క్యాపిటల్ సిటీ సనాలో కూడా పలు చోట్ల సౌదీ దళాలు వైమానిక దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్ధలు పేర్కొన్నాయి. యెమెన్‌లో ఉన్న హౌతీ తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని సౌదీ సంకీర్ణ దళాలు ఈ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించాయి.

  Afghan Porn Star: అప్ఘానిస్తాన్‌లో ఏకైక పోర్న్ స్టార్ ఈమె..తాలిబన్లకు చిక్కితే తల తెగడం ఖా

  కాగా, జనవరి 17న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (USE) రాజధాని అబుధాబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై యెమన్ హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి చేశారు. ఈ బాంబు దాడిలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఏంతో రద్దీగా ఉండే అబుధాబి ఎయిర్‌పోర్టుపై ఉగ్రడాది జరగడంతో యూఏఈ ఉలిక్కిపడింది. ఆ తర్వాత దానికి ప్రతిగా సౌదీ సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న యెమెన్ రాజధాని సనాపై జనవరి 18న వైమానిక దాడులు జరిపాయి. ఆ దాడుల్లో 11 మంది మరణించారు. ఆ తర్వాత హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ వైపు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లను సౌదీ సంకీర్ణదళాలు అడ్డుకున్నాయి. అబుధాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి తర్వాత.. యెమెన్, సౌదీ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

  67 ఏళ్లుగా స్నానమే చేయలేదు.. చెత్త కుప్పలో భోజనం.. కానీ ఎంత ఆరోగ్యంగా  ఉన్నాడో చూడండి

  హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వం మీద, సౌదీ సారథ్యంలోని సంకీర్ణంపైన చాలాకాలంగా పోరాడుతున్నారు. వీరికి ఇరాన్ సహకారముంది. 2015లో హౌతీల దాడులతో యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రాబ్బు మన్సూర్ హాదీ దేశం విడిచి పరారైనప్పటి నుంచీ అక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా అండగా ఉంది. యూఏఈ, మరికొన్ని మధ్య ప్రాచ్య దేశాలతో కలిసి హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. సౌదీ అరేబియాతో పాటు యూఏఈ కూడా తమపై పోరాటం చేస్తుండడంతో హౌతీ తిరుగుబాటుదారులు ఆ దేశం లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల అబుధాబి ఎయిర్‌పోర్టుపై దాడి చేశారు.

  YouTube channels blocked : 35 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం.. పలు సోషల్ మీడియా ఖాతాలు కూడా..

  యెమెన్‌లో అంతర్యుద్దంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. బాంబు దాడులు, వ్యాధులు, ఆకలి కేకలతో ఈ ఏడేళ్లలో ఏకంగా 3,77,000 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది ఇళ్లు, భూములను విడిచిపెట్టి..ఇతర దేశాలకు పారిపోతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Saudi Arabia, Yemen

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు