హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China President : బహిరంగ కార్యక్రమంలో కనిపించిన జిన్ పింగ్..అధ్యక్షుడి మార్పు తప్పదా?

China President : బహిరంగ కార్యక్రమంలో కనిపించిన జిన్ పింగ్..అధ్యక్షుడి మార్పు తప్పదా?

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

Xi Jinping public appearance : గత నాలుగు రోజులుగా చైనా అధ్యక్షుడు(China president) జిన్‌పింగ్‌పై వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Xi Jinping public appearance : గత నాలుగు రోజులుగా చైనా అధ్యక్షుడు(China president) జిన్‌పింగ్‌పై వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సైన్యం తిరుగుబాటు చేసిందని, జిన్‌పింగ్‌(Xi Jinping)ను గృహ నిర్బంధం(House Arrest)లో ఉంచిందని ఒక్కసారిగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. సైనికాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టనునట్టు వార్తలు వచ్చాయి. వీటిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేనప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సాగింది. జిన్ పింగ్ వరుసగా మూడోసారి కూడా చైనా అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తుండడం వల్ల, ఉజ్బెకిస్తాన్‌ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనపై కుట్ర జరిగిందనేది ఆ వార్తల సారాంశం. 80 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్ బీజింగ్ దిశగా వెళ్తున్నట్టు,రాజధాని బీజింగ్ చుట్టూ సైన్యం మోహరించినట్టుగా ఉన్న కొన్ని వీడియోలు బయటకి రావడం ఈ ప్రచారాన్ని నిర్థారించేలా ఉన్నాయి, అయితే ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. చైనా మీడియా సంస్థలు కూడా దీనిపై స్పందించలేదు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గృహ నిర్బంధం వార్తలకు చెక్‌ పడింది.

ఈ నెల 16న‌ ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై స‌హ‌కార సంస్థ (ఎస్సీవో) స‌ద‌స్సులో పాల్గొని తిరిగి చైనాకు చేరిన తర్వాత ఆయన తొలిసారిగా బీజింగ్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ‌చ్చేనెల నుంచి చైనా క‌మ్యూనిస్టు పార్టీ జాతీయ స‌ద‌స్సు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌ను మంగ‌ళ‌వారం ఆయ‌న ప్రారంభించారు. ఆ దృశ్యాలను చైనా మీడియా ప్రసారం చేసింది. దీంతో చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, జిన్‌పింగ్‌ను అరెస్టు చేశారని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలకు పూర్తిగా తెరపడింది. కాగా,చైనా కొవిడ్‌-19 జీరో పాల‌సీలో భాగంగా విదేశాల నుంచి వ‌చ్చిన వారు వారం పాటు త‌ప్ప‌నిస‌రి క్వారంటైన్‌లో ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. త‌ర్వాత మూడు రోజుల పాటు ఇంట్లోనే బ‌స చేయాలి. చైనాలో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జిన్‌పింగ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.

Pregnant woman murder : బలి ఇచ్చేందుకు..గర్భిణిని చంపి, కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లారు!

ఐదేళ్లకొకసారి జ‌రిగే చైనా క‌మ్యూనిస్టు పార్టీ జాతీయ స‌ద‌స్సులో మూడో ద‌ఫా చైనా అధ్య‌క్షుడిగా జీ జిన్‌పింగ్‌ను నియ‌మించ‌డానికి రంగం సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన అధ్యక్షుడు జిన్ పింగ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుని ముచ్చటగా మూడోసారి చైనా పగ్గాలు అందుకునే దిశగా సాగుతున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో జరిగే అతి కీలకమైన సీపీసీ సమావేశాలకు జిన్ పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2,300 మంది ప్రతినిధులు ఎన్నికైనట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ తెలిపింది ఫలితంగా జిన్ పింగ్ మూడోసారి చైనా అధికారపగ్గాలు చేపట్టేందుకు ఆ సీపీసీ సమావేశాల్లోనే ఆమోదం లభించనుందని విస్తృతంగా చర్చ జరుగుతోంది. వ‌చ్చే నెల‌లో జీ జిన్‌పింగ్‌ను అధ్య‌క్షుడిగా కొన‌సాగిస్తారా., ఆయ‌న స్థానంలో లీ కియామింగ్‌ను నియ‌మిస్తారా అన్న అంశంపై స‌స్పెన్స్ కొనసాగుతోంది

Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Xi Jinping

ఉత్తమ కథలు