Home /News /international /

WOULD BE MORE DANGEROUS IF FORCED TO STEP DOWN PAKISTAN PM WARNS OPPOSITION GH VB

Pak PM: ‘నన్ను పదవి నుంచి దించేయాలని చూస్తే మీకే రిస్కు’.. విపక్షాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిక..

ఇమ్రాన్​ఖాన్​ (ఫైల్​)

ఇమ్రాన్​ఖాన్​ (ఫైల్​)

"బలవంతంగా పదవీ విరమణ చేయించాలని చూస్తే నేను మరింత ప్రమాదకరంగా మారుతాను" ఈ వ్యాఖ్యలు చేసింది సినిమా హీరో అని అనుకుంటే మీరు పొరబడినట్లే. తాను ప్రధాని పీఠంపై నుంచి దిగిపోవాలని వస్తున్న డిమాండ్​లపై స్పందిస్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఘాటు వ్యాఖ్యలివి. వివరాలిలా..

ఇంకా చదవండి ...
"బలవంతంగా పదవీ విరమణ చేయించాలని చూస్తే నేను మరింత ప్రమాదకరంగా మారుతాను" ఈ వ్యాఖ్యలు చేసింది సినిమా హీరో అని అనుకుంటే మీరు పొరబడినట్లే. తాను ప్రధాని పీఠంపై నుంచి దిగిపోవాలని వస్తున్న డిమాండ్​లపై స్పందిస్తూ పాకిస్థాన్ ప్రధాని(Pakistan Prime Minister) ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చేసిన ఘాటు వ్యాఖ్యలివి. దేశంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్ ఇలా స్పందించారు. దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యానికి వ్యతిరేకంగా పాకిస్థాన్​లోని డజనుకు పైగా విపక్ష పార్టీలు ఓ కూటమిగా ఏర్పడ్డాయి. నామమాత్రంగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో సైన్యం "తోలుబొమ్మ" ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్​ను కూర్చోబెట్టిందని ఈ కూటమి ఆరోపిస్తోంది. ఈ మేరకు ఇమ్రాన్ అసమర్థ, చట్టవిరుద్ధమైన పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు మార్చి 23న ఇస్లామాబాద్​కు(Islamabad) లాంగ్ మార్చ్(Long March) ప్రారంభించనున్నట్లు పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) అధ్యక్షుడు, జమియత్ ఉలేమా-ఏ-ఇస్లాం-ఫజల్ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ప్రకటించారు.

Farmer Revenge: కార్ల షోరూమ్‌లో రైతుకు ఘోర అవమానం.. తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు!


విపక్షాలకు దారేదీ..
అయితే.. ఈ లాంగ్ మార్చ్​పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. బలవంతంగా పదవీ విరమణ చేయించాలని చూస్తే నేను మరింత ప్రమాదకరంగా మారుతాను అంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అంతేగాక తాను వీధుల్లోకి వస్తే, ప్రతిపక్ష పార్టీలు దాక్కునేందుకు చోటే దొరకదు అని హెచ్చరించారు. విపక్షాలు తలపెట్టిన యాత్ర విఫలమవుతుందన్న ఇమ్రాన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలతో సమానంగా రాజకీయ పార్టీలకు సైతం ఎటువంటి మినహాయింపులు ఇచ్చేదిలేదని ఇమ్రాన్ కుండబద్ధలు కొట్టారు.

విపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటున్నాయని, అయితే వారికి అవకాశమిస్తే ద్రోహం చేసినట్లే అని ఖాన్ తెలిపారు. తన ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆయన లండన్​కి పారిపోతారు: ఇమ్రాన్ ఖాన్
ఈ సందర్భంగా పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) చీఫ్ నవాజ్ షరీఫ్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించకుండా అవినీతి కేసుల నుంచి తప్పించుకుంటున్నారని ఖాన్ ఆరోపించారు. అవినీతి కేసులో లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఏడేళ్లపాటు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్.. వైద్యం కోసం లండన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం మొత్తం లండన్‌కు పారిపోతుందని ఇమ్రాన్​ ఖాన్ మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ దేశానికి తిరిగి రావడంపై అడిగిన ప్రశ్నకు "అతను తిరిగి రాడు. ఆయన డబ్బునే ప్రేమిస్తాడు" అంటూ ఖాన్ మండిపడ్డారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన షెహబాజ్ షరీఫ్​పైనా ఇమ్రాన్​ ఖాన్ మండిపడ్డారు. అతడిని దేశం యొక్క నేరస్థుడిగా చూస్తున్నట్లు వెల్లడించారు.

Selfie: ఈ అందగాడు సెల్ఫీలతో కోటీశ్వరుడయ్యాడు.. ఏడేళ్లుగా రోజుకో సెల్ఫీ.. NFTలో భారీ డిమాండ్..


అది మీ చేతగానితనం: మరియం
అయితే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. అధికారం నుంచి తొలగిస్తే మరింత ప్రమాదకరంగా మారతారని హెచ్చరికలు కేవలం బెదిరింపులు మాత్రమేనని స్పష్టం చేశారు. "ఖాన్ తన ఓటమిని అంగీకరించాడు. ప్రభుత్వంలోకి వచ్చి నాలుగేళ్లయినా సరైన పాలన అందించలేదు. అంతేగాక మీ చుట్టూ ఉన్న మాఫియా కోట్ల రూపాయల డబ్బుతో దేశం విడిచి పారిపోయింది" అని మరియం నవాజ్ ట్వీట్ చేశారు. తన తండ్రి ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఆమె ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఇక దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. "రాత్రిపూట నాకు నిద్ర పట్టుకుండా చేస్తున్న ఏకైక సమస్య ద్రవ్యోల్బణం. బ్రిటన్​ సైతం ఈ సమస్యను ఎదుర్కొంటోంది" అని తెలిపారు.
Published by:Veera Babu
First published:

Tags: Imrankhan, Pakistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు