HOME »NEWS »INTERNATIONAL »worlds most expensive chicken biryani here is price and all other details sk

Gold Biryani: ఇది ప్రపంచంలోనే ఖరీదైన బిర్యానీ.. ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

Gold Biryani: ఇది ప్రపంచంలోనే ఖరీదైన బిర్యానీ.. ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం
రాయల్ గోల్డ్ బిర్యానీ

World's most expensive biryani: బాంబే బోరోస్ రెస్టారెంట్ ఇన్‌స్టగ్రామ్ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇది దుబాయ్‌లో అత్యంత ఖరీదైన బిర్యానీ. ఐతే ప్రపంచంలో ఇంకెక్కడా ఇంత ఖరీదైన బిర్యానీ ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నా

  • Share this:
    బిర్యానీ.. ఈ పేరు వింటేనే మనలో చాలా మంది నోళ్లలో నీళ్లు ఊరుతాయి. హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మరి మన వద్ద బిర్యానీ ధర ఎంత ఉంటుంది? సింగిల్ చికెన్ బిర్యానీ రూ.100 నుంచి 150 ఉంటుంది. అదే ఫుల్ బిర్యానీ అయితే రూ.200-250కి దొరుకుతుంది. కానీ ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ తినాలంటే దాదాపు రూ.20వేలు ఖర్చు చేయాలి. వామ్మో.. ఇదేంటి. బిర్యానీకి అంత రేటా? అందులో ఏముంటుంది? ఏంటా బిర్యానీ? అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఈ బిర్యానీ తినాలంటే వేలకు వేలు వదులుకోవాలి. మరి ఏంటి దాని ప్రత్యేకత? ఎందుకంత రేటు?

    ఈ బిర్యానీ పేరు రాయల్ గోల్డ్ బిర్యానీ. దుబాయ్‌లోని బాంబే బోరో రెస్టారెంట్‌లో లభిస్తుంది. పేరులో ఉన్నట్టుగానే నిజంగానే అది బంగారం. బిర్యానీతో పాటు 23 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ వడ్డిస్తారు. అందుకే అంత రేటన్నమాట. రాయల్ గోల్డ్ బిర్యానీని పెద్ద బంగారం కంచంలో వడ్డిస్తారు. బిర్యానీలో మీకు నచ్చిన రైస్ అందిస్తారు. అది ఆప్షనల్. బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్ రైస్, సాఫ్రాన్ రైస్.. ఇందులో ఏది తింటారో మీ ఇష్టం. ఈ బిర్యానీ రైసే దాదాపు 3 కేజీలు ఉంటుంది. ప్లేట్‌లో బంగారం రేకుల్లో చుట్టిన కశ్మీరీ లాంబ్ సీక్స్ కబాబ్స్, రాజ్‌పుత్ చికెన్ కబాబ్స్, ఢిల్లీ లాంబ్ చాప్స్, మొగలాయ్ కోఫ్తా, మలాయ్ చికెన్ రోస్ట్ కూడా ఉంటాయి. రైస్‌తో పాటు చిన్న బంగాళా దుంపలు, ఉడకబెట్టిన గుడ్లు, వేయించిన జీడిపప్పు, దానిమ్మ గింజలు, వేయించిన ఉల్లి రెబ్బలు, పుదీనా, సాస్, కర్రీస్, రైతా వడ్డిస్తారు. ఇది చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా రిచ్‌గా ఉంటుంది.




    బాంబే బోరోస్ రెస్టారెంట్ ఇన్‌స్టగ్రామ్ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇది దుబాయ్‌లో అత్యంత ఖరీదైన బిర్యానీ. ఐతే ప్రపంచంలో ఇంకెక్కడా ఇంత ఖరీదైన బిర్యానీ ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:February 23, 2021, 16:45 IST