హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Third World War : మూడో ప్రపంచ యుద్థం మొదలైంది..రష్యా సంచలన ప్రకటన!

Third World War : మూడో ప్రపంచ యుద్థం మొదలైంది..రష్యా సంచలన ప్రకటన!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Russian State TV Says World War III Begun : రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌకే మాస్కోవాని మిసైల్స్‌తో పేల్చామని ఉక్రెయిన్‌ అధికారులు గురువారం ప్రకటించారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది.

ఇంకా చదవండి ...

Russian State TV Says World War III Begun : రష్యా- ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధికారిక మీడియా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూడో ప్రపంచ యుద్దం(World War III)ఇప్పటికే మొదలైందని రష్యా ప్రధాన అధికారిక మీడియా ‘రష్యా 1’ పేర్కొంది. ఉక్రెయిన్‌ తో యుద్ధంలో.. నల్ల సముద్రంలో రష్యా యుద్ధ నౌక మాస్కోవా మునకతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రష్యా వన్‌ లో శుక్రవారం ప్రసారం అయ్యింది. రష్యా భారీ యుద్ధ నౌక(Russia War Ship)మాస్కోవా అగ్నిప్రమాదంలో.. దెబ్బతిన్నదని గురువారం క్రెమ్లిన్‌ ప్రకటించున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ మాత్రం.. తమ నెప్ట్యూన్ క్షిపణి ద్వారా నల్ల సముద్రంలో ఉన్నప్పుడు ఆ ప్రధాన నౌకను నాశనం చేసినట్లు గర్వంగా ప్రకటించుకుంది. ఈ ఘటనను ఉద్దేశిస్తూ శుక్రవారం రష్యా ప్రభుత్వ ఛానెల్‌ ‘రష్యా 1’ ఛానెల్‌ ప్రజెంటర్‌ ఒల్గా స్కాబెవెయా ఓ డిబెట్‌లో.. అధికారంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ ప్రకటన చేశారు. నౌక మునకతో రష్యా ప్రధాన ఆలోచన పక్కదారి పట్టిందని హెచ్చరించింది. నౌక మునక పరిస్థితులను మూడో ప్రపంచయుద్ధంగా పిలవొచ్చునని, ఇది ఖచ్చితంగా జరుగుతుందని న్యూస్ ప్రజెంటర్ ఓల్గా స్కాబెయేవా తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం నాటో ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌తో రష్యా(Russia)పోరాడుతున్నట్టే భావించాలని,ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉందంటూ వ్యూయర్స్‌ ను ఉద్దేశిస్తూ ఆవేశపూరితంగా ఆమె మాట్లాడారు. అదే షోలో గెస్ట్‌గా పాల్గొన్న ఓ వ్యక్తి.. స్పందిస్తూ... యుద్ధ నౌక మునకను రష్యా గడ్డపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌పై దాడిని ప్రభుత్వం ‘ప్రత్యేక సైనిక చర్య’ అంటోంది కదా అని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆమె మూడో ప్రపంచ యుద్ధం అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా ఈ చర్చకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


కాగా.రష్యా ప్రభుత్వానికి చెందిన ఇంకో టెలివిజన్ ఛానల్ వన్‌లో వ్రేమ్యా పోకాజెట్ హోస్ట్ ఒలేస్యా లోసెవా.. రెచ్చగొట్టడం, భయపెట్టడం, రక్తపాతం అనే పశ్చిమ దేశాల ప్రణాళికలను ఉక్రెయిన్ అమలుచేస్తోంది.. ఇది పూర్తిగా ఊహించలేనిది అని వాదించారు. పశ్చిమ దేశాలు ప్రస్తుతం ఉక్రెయిన్‌ కు పెద్ద సంఖ్యలో ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని చెప్పారు.

మరోవైపు, ఉక్రెయిన్‌‌కు రష్యా హెచ్చరికలు చేసింది. కీవ్ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని, దీనికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని బెదిరించింది. తమ గడ్డపై విధ్వంసానికి దిగితే కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తాజా హెచ్చరించింది. "రష్యా భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు లేదా విధ్వంసానికి ప్రయత్నిస్తే కీవ్‌పై క్షిపణి దాడులు మరింత పెరుగుతాయి" అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో రష్యా రక్షణశాఖ తెలిపింది. తమ సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ క్షిపణి దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా హెచ్చరికలు చేసింది.

ALSO READ Oil Prices : పాక్ లో లీటరు పెట్రోల్ పై రూ.83,డీజిల్ పై రూ.119 పెంపు!

అయితే రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌకే మాస్కోవాని మిసైల్స్‌తో పేల్చామని ఉక్రెయిన్‌ అధికారులు గురువారం ప్రకటించారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది.అయితే.. తిరుగు ప్రయాణంలో అది మునిగిపోయినట్లు కాసేపటికే సవరణ ప్రకటన చేసింది. మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లను మోసుకుపోతుంది. నౌకలో ఆయుధాలు పేలడంతో నిప్పంటుకుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Russia, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు