మాస్క్ ధరించలేదని యువకుడిని విమానంలో చావబాదిన...ప్రయాణికులు...వీడియో వైరల్...

యూరప్ లోని అన్ని విమానాలలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి, కాని ఆ యువకుడు విమానంలోకి ప్రవేశించిన తర్వాతే మాస్క్ ను తొలగించాడు. దీంతో కొంతమంది ప్యాసింజర్లు మాస్క్ ధరించమని కోరగా అతడు ససేమిరా అన్నాడు

news18-telugu
Updated: August 3, 2020, 3:25 PM IST
మాస్క్ ధరించలేదని యువకుడిని విమానంలో చావబాదిన...ప్రయాణికులు...వీడియో వైరల్...
(Image: twitter)
  • Share this:
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డమ్ నుండి, స్పెయిన్ కు చెందిన ఇబిజాకు వెళ్లే విమానం కుస్తీ వేదికగా మారింది. ఈ విమానంలో ఉన్న ఓ యువకుడు ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించాడు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అతడిని ముసుగు ధరించమని కోరినప్పటికీ, అతను ససేమిరా అన్నాడు. అంతేకాదు మాస్క్ పెట్టుకోమన్నందుకు దురుసుగా వ్యవహరించాడు. దీంతో ఆగ్రహం చెందిన కొంతమంది ప్యాసింజర్లు అతడిపై తీవ్రంగా కొట్టారు. విమాన సిబ్బంది జోక్యం చేసుకొని వదిలే వరకూ శాంతించలేదు.



డైలీ మెయిల్ పత్రిక వార్తల ప్రకారం, యూరప్ లోని అన్ని విమానాలలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి, కాని ఆ యువకుడు విమానంలోకి ప్రవేశించిన తర్వాతే మాస్క్ ను తొలగించాడు. దీంతో కొంతమంది ప్యాసింజర్లు మాస్క్ ధరించమని కోరగా అతడు ససేమిరా అన్నాడు. దీంతో అతడితో పాటు అతడికి వత్తాసు పలికి మరో స్నేహితుడిని కూడా ప్రయాణికులు గుంపులుగా ఏర్పడి చితగ్గొట్టారు. అతడిని నిలబడటానికి కూడా వీలుకాని విధంగా కొట్టారని బాధితుడి స్నేహితులు ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ యుద్ధ కాండను ఫ్లైట్ ఫ్లోర్‌లో ఉన్న ఓ వ్యక్తి వీడియోలో చిత్రించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఒక వైపు కరోనా సంక్రమణ కేసులు పెరుగుతున్నప్పటికీ, ముసుగు ధరించకుండా యువకుడు బాధ్యతారహితంగా వ్యవహరించాడని, అందుకే కొట్టాల్సి వచ్చిందని ప్రయాణికుల్లో ఒకరు తెలిపారు. అతడి నిర్లక్ష్యం ఇతర ప్రయాణికుల భద్రతకు ముప్పు అని వారు అంటున్నారు. కాగా మాస్క్ ధరించని యువకుడిని ప్రస్తుతం స్పానిష్ పోలీసులు అరెస్ట్ చేశారు.అందుకున్న సమాచారం ప్రకారం మాస్క్ ధరించని యువకుడు మద్యం సేవించి ఉన్నారని తేలింది. ఇదిలా ఉంటే యూరప్ విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading