• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • WORLD TUBERCULOSIS DAY 2019 HOW TO FIGHT WITH TB WHAT ARE TUBERCULOSIS SYMPTOMS NK

సైలెంట్‌గా విజృంభిస్తున్న టీబీ... క్షయ వ్యాధి లక్షణాలేంటి... రాకుండా ఏం చెయ్యాలి

సైలెంట్‌గా విజృంభిస్తున్న టీబీ... క్షయ వ్యాధి లక్షణాలేంటి... రాకుండా ఏం చెయ్యాలి

ప్రతీకాత్మక చిత్రం

World Tuberculosis Day 2019 : ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్థుల సంఖ్య తగ్గాల్సిన స్థాయిలో తగ్గట్లేదు. భారతదేశం ఈ వ్యాధిపై పెద్ద యుద్ధమే చేస్తోంది.

  • Share this:
కుష్టువ్యాధి, గజ్జి, క్షయ (టీబీ) వంటి వ్యాధుల్ని మనం లైట్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ జబ్బులు ఇప్పుడు లేవని మన ఫీలింగ్. నిజమే కుష్టువ్యాధి, గజ్జి, తామర వంటివి ఇప్పుడు దాదాపు లేవు. కానీ, క్షయ వ్యాధి మాత్రం సైలెంట్‌గా విస్తరిస్తోంది. దురదృష్టమేంటంటే ప్రపంచంలోనే క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నది భారత్‌లోనే. వ్యాధి గురించి సరిగా తెలియకపోవడం, దాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో... దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ వ్యాధి వస్తోంది, రోజూ దేశంలో 1000 మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తెలంగాణలో 72,674 టీబీ కేసులు ఉన్నాయంటే నమ్మగలరా. అసలా వ్యాధి ఎలా సోకుతుంది? రాకుండా ఏం చెయ్యాలి? వస్తే, ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం.

ప్రాణాలు తీసే క్షయ వ్యాధి మైకోబ్యాక్టీరియమ్ టూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతోందని 1882, మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్ కుచ్ తెలుసుకున్నాడు. దాని నివారణ కోసం ప్రయత్నించాడు. 1905లో ఆయన్ను నోబెల్ బహుమతి వరించింది. ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి (నివారణ) దినాన్ని జరుపుకుంటున్నాం.

క్షయ వ్యాధి లక్షణాలు :
* గొంతులో ఏదో (కఫం) ఉన్నట్లు దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గకుండా ఉందామన్నా ఉండలేం. పొడి దగ్గు వస్తూ ఉంటుంది.
* ఏం చేసైనా సరే... రెండు వారాల్లో పొడి దగ్గును తగ్గించేసుకోవాలి. లేదంటే అదే క్షయ వ్యాధి వచ్చేందుకు కారణం అవుతుంది.
* క్షయ వస్తే ఇక దగ్గు ఆగదు. కంటిన్యూగా వస్తూనే ఉంటుంది.
* సాయంత్రం, రాత్రి వేళల్లో జ్వరం వస్తూ ఉంటుంది, చెమటలు పడతాయి.
* బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇది స్పష్టంగా కనిపించే లక్షణం. ఎంత తిన్నా బరువు తగ్గిపోతారు. అసలు ఆకలే వెయ్యదు.
* పెద్దగా పనిచెయ్యకపోయినా ఆయాసం వచ్చేస్తుంది. నీరసం కూడా వస్తుంది.
* వ్యాధి ముదురుతూ ఉంటే, దగ్గుతోపాటూ (కఫంతోపాటూ)... రక్తం కూడా వస్తూ ఉంటుంది.

సమస్యేంటంటే... టీబీ ఒక రకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాళ్లు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మివేసినప్పుడు... బయటకు వచ్చే గాలిలో ఉండే తుంపర్లలో బ్యాక్టీరియా... చుట్టుపక్కలవాళ్లకు చేరుతుంది. అలా వ్యాధి వాళ్లకు కూడా సోకుతుంది.

ఈ వ్యాధి రెండు రకాలు. మొదటిది ఊపిరితిత్తుల క్షయ. ఇది మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. రెండోది ఇతర అవయవాల క్షయ. శరీరంలో ఏ అవయవానికి క్షయ వ్యాధి రావచ్చు. ఊపిరితిత్తుల క్షయ వ్యాధి మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

వ్యాధి రాకుండా ఏం చెయ్యాలి :
* మంచి ఆహారం తీసుకోవాలి. స్పైసీ (మసాలా) ఫూడ్ తగ్గించాలి.
* దగ్గు, జలుబు, జ్వరం లాంటి వాటిని వీలైనంత త్వరగా తగ్గించేసుకోవాలి.
* రెండు వారాల కంటే ఎక్కువ రోజులు పొడి దగ్గు వస్తూ ఉంటే, వెంటనే డాక్టర్‌ను కలవాలి.

వచ్చిన వ్యాధి తగ్గాలంటే ఏం చెయ్యాలి :
* టీబీపై కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. టీబీ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి అనే నినాదం తీసుకుంది.
* స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలు చేస్తారు.
* క్షయవ్యాధి ఉన్న వారికి నెలకు రూ.500లను ప్రభుత్వం నేరుగా బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తోంది.
* కొంతమందిలో సాధారణంగా మందులు వాడగానే వ్యాధి తగ్గిపోతుంది.
* తాగుడు, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే, వ్యాధి త్వరగా తగ్గకపోగా, ఎండీఆర్ టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ)గా మారుతుంది. వ్యాధి నిర్ధారణ సమయంలో రోగికి సాధారణ టీబీ ఉందా లేక ఎండీఆర్ టీబీ ఉందా అనేదానిని నిర్ధారిస్తారు.
* క్షయకు ఇచ్చిన మందులు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. మధ్యలో మానేస్తే ప్రమాదం. మళ్లీ వచ్చేస్తుంది. డాక్టర్లు చెప్పిన మాట వినాల్సిందే.

2030 నాటికి క్షయరహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 శాతం దాకా టీబీ వ్యాప్తి తగ్గుతోంది. 2000-17 మధ్య కాలంలో టీబీని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా 5.4 కోట్ల మందిని కాపాడగలిగారు. ఇదంతా కాదు. అసలీ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడదాం. దురదృష్టవశాత్తూ సోకితే... ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి... దాన్ని తరిమికొడదాం. టేక్ కేర్.

 

 

ఇవి కూడా చదవండి :

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు
First published:

అగ్ర కథనాలు