World Ozone Day: : నేడు ఓజోన్ డే... ఇదీ చరిత్ర

International Ozone Day : ఓజోన్ పొరను రక్షించుకోవడానికి ఓ రోజును పెట్టుకోవడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భూమిపై జీవరాశి ఉండటానికి ఓజోనే కారణం. ఆ పొరే లేకపోతే... భూమి అగ్నిగోళంలా మండుతూ ఉండేదే.

Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 10:47 AM IST
World Ozone Day: : నేడు ఓజోన్ డే... ఇదీ చరిత్ర
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
World Ozone Day : ఈ రోజుల్లో మనం తీసుకునే ప్రతీ నిర్ణయమూ ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. భూతాపం పెరిగినా, వానలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కువైనా... ఇలాంటి అనర్థాలన్నీ ఓజోన్ పొరను దెబ్బతీసేవే. పాలపై మీగడలా... ఈ ఓజోన్ అనే వాయువు... భూమి చుట్టూ ఓ పొరలా అల్లుకొని ఉంది. ఇది భూమి నుంచీ స్ట్రాటో ఆవరణంలో... 15 నుంచీ 50 కిలోమీటర్ల మందంలో విస్తరించి ఉంది. సూర్యుడి నుంచీ వచ్చే అతి నీలలోహిత కిరణాలు డైరెక్టుగా భూమిపై పడనివ్వకుండా... ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఫలితంగా భగభగ మండే కిరణాలు మనపై పడకుండా ఉంటున్నాయి. ఆ పొరే గనక లేకపోతే... ఆ కిరణాలు డైరెక్టుగా భూమిపై పడి... మొత్తం ప్రాణికోటి చనిపోయేదే. సమస్యేంటంటే... పెరుగుతున్న భూతాపం వల్ల నానాటికీ ఓజోన్ వాయువు తగ్గిపోతోంది.

1980లో మొదటిసారి ఓజోన్ పొరకు కన్నం పడిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల భూమిపై డైరెక్టుగా సూర్యకిరణాలు పడిపోతున్న విషయం బయటపడింది. ఇలాగే పొర విచ్ఛిన్నం అవుతూ పోతే... కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటిపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. చర్మంపై తీవ్రమైన సూర్యకిరణాలు పడి... కేన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

ఓజోన్ కోసం సెప్టెంబర్ 16 : ఓజోన్ అంటే ఏంటో, దాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం కోసం ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం జరుపుతున్నారు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న స్ప్రేలు, పొలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిజ్‌లు, కార్లపై వేస్తున్న కలర్స్, క్లోరో ఫ్లోరో కార్బన్ల వంటి వాటి వాడకాన్ని ఆపేయాలని 1987లోనే నిర్ణయం తీసుకున్నా... ఇప్పటికీ అది అమలవ్వట్లేదు. ఫలితంగా ఓజోన్ పొర దెబ్బతింటూనే ఉంది.

ఓజోన్ కోసం ఏం చెయ్యాలి :
1.క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా చెయ్యాలి.
2. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలూ చేపట్టాలి.
3. మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి.4. పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలి.
5. అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాళ్లూ నిర్మించేటప్పుడే... 33 శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు ప్లేస్ ఉండేలా నిబంధనలు తేవాలి.
6. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచడం ద్వారా... భూతాపాన్ని తగ్గిస్తూ... ఓజోన్ పొరను కాపాడేందుకు వీలవుతుంది.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading