World Ozone Day 2020: కరోనా లాక్‌డౌన్ తో జరిగిన లాభం ఇదే...ఓజోన్ పొరపై ఆసక్తికర అధ్యయనం..

ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఈ పొరకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 16, 2020, 5:43 PM IST
World Ozone Day 2020: కరోనా లాక్‌డౌన్ తో జరిగిన లాభం ఇదే...ఓజోన్ పొరపై ఆసక్తికర అధ్యయనం..
ఓజోన్ పొర File)
  • Share this:
మనవాళికి ఒక మంచి వార్త. ఎన్నో విధాలుగా మనకు సాయం చేస్తున్న ఓజోన్ పొర ఇప్పుడిప్పుడే బలపడుతోందని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రదేశాలలో ఓజోన్ పొరకు పడిన రంధ్రాలు మూసుకుపోతున్నాయని శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఈ పొరకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మానవ కార్యకలాపాలు ఓజోన్ పొర క్షీణతకు దారితీశాయి. సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలను గ్రహించడంతో పాటు అవి భూమిని చేరుకోకుండా ఓజోన్ పొర నిరోధిస్తుంది. సముద్ర ప్రవాహాలను వాటి సహజ మార్గంలో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కోసం అడవులను నరికివేయడం, కర్మాగారాల ఏర్పాటు, సహజ వనరులను విచక్షణారహితంగా ఉపయోగించడం వంటివి ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్నాయి.

ఈ రక్షిత పొరకు రంధ్రాలు పడినట్టు నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ లో ఓజోన్ పొరపై శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఓజోన్ పోరకు ఉన్న భారీ రంధ్రం అభివృద్ధి చెందిందని, ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు దారితీశాయని వారు చెబుతున్నారు. ఉత్తర ధ్రువం వద్ద ఉన్న శీతల వాతావరణం కూడా ఓజోన్ పొరకు రంధ్రం పడటానికి కారణమని వారు విశ్లేషిస్తున్నారు.

ఈ రంధ్రం 6,20,000 చదరపు మైళ్ల విస్తీర్ణం వరకు విస్తరించి ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటివరకు గుర్తించిన వాటిలో ఇది అతిపెద్దది. కోపర్నికస్ అట్మాస్ఫియరిక్ మానిటరింగ్ సర్వీస్ (CAMS) వద్ద మరో రంధ్రం గమనించిన శాస్త్రవేత్తలు, తాజాగా అది మూసుకుపోయిందని వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్కిటిక్ స్ట్రాటో ఆవరణలో చాలా నెలలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పోలార్ స్ట్రాటోస్పియర్ మేఘాలు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు. దీని ఫలితంగా ఈ ప్రాంతంపై ఓజోన్లో రంధ్రం ఏర్పడింది.

ఓజోన్ పొరకు పడిన రంధ్రం దానంతట అదే మూసుకుపోవడంతో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంపై పర్యవేక్షణ కొనసాగించనున్నారు. ఆ ప్రాంతం స్ట్రాటో ఆవరణతో ఎలా కలిసిపోతుందో వారు పరిశోధించనున్నారు. ఇదే కాకుండా చాలా ప్రాంతాల్లో ఓజోన్ పొరకు పడిన రంధ్రాలు మూసుకుపోతున్నాయని వారు పేర్కొన్నారు.

గత సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా, ఐక్యరాజ్యసమితి ఓ కార్యక్రమం నిర్వహించింది. ఓజోన్ క్షీణతకు కారణమయ్యే పదార్ధాల ఉపయోగాలను నియంత్రించడం ద్వారా ఈ రక్షణపొర మళ్లీ కొత్తదనాన్ని నింపుకుందని ఆ సదస్సులో యూఎన్ ప్రకటించింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు వంటి ఇతర ఉత్పత్తులు విడుదల చేసే వాయువులు ఓజోన్ పొర క్షీణతకు దారితీస్తున్నాయని 1987లోనే ప్రపంచ దేశాలు గుర్తించాయి. అలాంటి రసాయనాల వాడకాన్ని తగ్గించడానికి ఆ సంవత్సరంలోనే మాంట్రియల్ ప్రోటోకాల్ పై అన్ని దేశాలూ సంతకాలు చేశాయి. ఆ ఘనతే ప్రస్తుతం ఓజోన్ పొర పునరుద్ధరణకు ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు.

1990-2010 నుండి వాతావరణంలోకి వెళ్లే 135 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను మాంట్రియల్ ప్రోటోకాల్ నివారించిందని యూఎన్ఈపీ తెలిపింది. ఉత్తర అర్ధగోళం, మధ్య అక్షాంశ ప్రదేశంలోని ఓజోన్ రంధ్రాలు 2030 నాటికి పూర్తిగా నిండిపోతాయని UNEP తెలిపింది. దక్షిణ అర్ధగోళంలో 2050 నాటికి అది పూర్తిగా మూసుకుపోతుందని ఆ సంస్థ తెలిపింది.
Published by: Krishna Adithya
First published: September 16, 2020, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading