అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా TANA ప్రత్యేక కార్యక్రమం.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వెంకయ్య నాయుడు, తానా (ఫైల్ ఫొటోలు)

’తెలుగు భాష- మన శ్వాస‘ అంటూ ఓ ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి భారత దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.

 • Share this:
  ఉన్నత ఉద్యోగావకాశాల కోసం దేశాలు దాటినా తెలుగు భాషపై మమకారాన్ని మాత్రం ప్రవాసులు వదులుకోలేదు. ఉపాధి కోసం ఆంగ్లభాషను నమ్ముకున్నా మాతృ భాషపై ఉన్న అభిమానాన్ని మాత్రం చూపుతూనే ఉన్నారు. తమ ఇళ్లల్లో తెలుగు భాషనే మాట్లాడుతుంటారు. అమెరికా గడ్డపై పుట్టిన తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తుంటారు. తాజాగా ’తెలుగు భాష- మన శ్వాస‘ అంటూ ఓ ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి భారత దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయ కర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

  ప్రతీ నెలా ఆఖరు ఆదివారం ’తానా ప్రపంచ సాహిత్య వేదిక‘ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం జరుగుతుంటుంది. అటు అమెరికా గడ్డపైన, ఇటు తెలుగు నేలపైన కూడా తెలుగు భాష అభ్యున్నతి కోసం తానా సాహిత్య వేదిక కృషి చేస్తుంటుంది. ఫిబ్రవరి 21వ తారీఖున ఆదివారం ’అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం‘ సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాహితీవేత్తలు తెలుగు భాష వైభవం పై పద్యాలు, పాటలు పాడే గాయనీగాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ’తల్లి భాష తెలుగు మన శ్వాస‘ పేరుతో నిర్వహించబోతున్న ఆన్ లైన్ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించనున్నారు.
  ఇది కూడా చదవండి: అమెరికాలోని భారతీయులకు శుభవార్తను చెప్పిన జో బైడెన్ సర్కారు.. అదే జరిగితే ప్రవాసులకు పండగే..

  ఈమని శివనాగిరెడ్డి, గణేశ్ తొట్టెంపూడి, అద్దంకి శ్రీనివాస్, అవధాని గన్నవరం లలిత ఆదిత్య, గుమ్మడి గోపాల కృష్ణ, విష్ణుభట్ల కార్తీక్, అద్దంకి వనీజ, సున్నపురాళ్ల సాయికిరణ్, సేక్ షహీద్, విషుభట్ల ప్రహర్షిత, ఏలూరు యంగప్పకవి, నూకతోటి శరత్ బాబు, ఆంజనేయులు ప్రతాప్, బీటీ నాగేంద్ర, చిత్తరంజన్ దాస్, చంద్రానాయక్, బండ వెంకన్న, కడప స్వాతి, కుంచపు అంజి, కృషిత నందమూరి, ధీరజ్ యలమంచి, శ్రీజరుగుల, పాలవలస రఘు, బి.యశోద, రామ మనోజ్ కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భారతీయ కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5.30గంటలకు) ఈ కార్యక్రమం జరుగుతుంది. YuppTV లోని తానా టీవీ చానెల్ ద్వారా కానీ, https://www.facebook.com/tana.org లింక్ ద్వారా ఫేస్ బుక్ లైవ్ లో కానీ, https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw లింక్ ద్వారా యూట్యూబ్ లో కానీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు.

  TANA PSV - Feb21 - Flyer
  Published by:Hasaan Kandula
  First published: