World Happy Day: ప్రపంచంలో ఆనందానికీ ఓ రోజు ఉంది. ఎందుకంటే... ఆనందంగా ఉండటం అనేది అత్యవసరం. ఆనందంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. చురుగ్గా పనులు చేసుకోగలుగుతాం. ఊసురోమని ప్రజలుంటే దేశమే గతి బాగుపడునోయ్... అన్నట్లుగా... ప్రజలు ఆనందంగా ఉంటేనే... దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఐతే... ప్రస్తుతం కరోనా కాలం. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఆనందం అలాగే ఉంది. వాటిలో టాప్ ప్లేస్‌లో నిలిచింది యూరప్ దేశం ఫిన్‌లాండ్ (Finland). ఈ సంవత్సరం... ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న ప్రజలున్న దేశం ఏదంటే ఫిన్‌లాండ్ పేరే మనం చెప్పుకోవాలి. ఇవాళ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కావడంతో... ప్రపంచ ఆనంద నివేదిక -2021ని ఐక్యరాజ్యసమితి (ఐరాస - United Nations Organisation) రిలీజ్ చేసింది. మరి ఈ లిస్టులో ఇండియా టాప్ 139వ స్థానంలో ఉంది. మొత్తం ఈ లిస్టులో ఉన్న దేశాలే 149. వాటిలో కింది నుంచి టాప్ 10లో భారత్ నిలవడం... భారతీయులకు విచారకరమే.
యూరప్‌లోని ఫిన్‌లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్ వంటి దేశాలు... ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంటాయి. ఫిన్‌లాండ్ ఏకంగా నాలుగోసారి ఈ స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఐస్‌లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ యుద్ధాల్లో పెద్దగా పాల్గొనలేదు. అందువల్ల వీటికి పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. పైగా ఈ దేశాల్లో జనాభా చాలా తక్కువ. అందువల్ల ఇక్కడి వారికి అన్ని వసతులూ చక్కగా లభిస్తున్నాయి.
World Happiness Report 2021, India has been ranked as the 10 least happy country in the world, secured 92nd position out of 95.#4_साल_यूपी_बेहाल #7_साल_देश_बेहाल pic.twitter.com/xrCDzjqhPI
— आनन्द प्रिय राहुल (@apr_bharat) March 19, 2021
ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉండే అమెరికా... కాస్త మెరుగై... 18వ ప్లేస్ నుంచి 14వ ప్లేస్‌కి చేరింది. 2012 నుంచి ఐరాస (UNO)కి చెందిన ‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్’ ప్రతి సంవత్సరం ప్రపంచ ఆనంద నివేదికను బయటపెడుతోంది. నిజానికి ఈసారి లిస్టులో 149 దేశాలు ఉన్నా... కరోనా కారణంగా 100 దేశాల్లోనే అధ్యయనం చేసింది. మిగతా దేశాలను అంచనాగా లెక్కవేసింది. అందుకు ఇదివరకు చేసిన ‘గాలప్ వరల్డ్ పోల్’ డేటాను లెక్కలోకి తీసుకుంది.
స్వీడన్ 6వ స్థానంలో ఉండగా... టెక్నాలజీవైపు పరుగులు పెడుతున్న జర్మనీ 10 ర్యాంకులు బలపడి... ఏడో స్థానానికి చేరింది. షాకింగ్ విషయమేంటంటే... 2019 వరకు తొలి మూడు ర్యాంకుల్లో ఉన్న నార్వే... ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. ఇక బ్రిటన్ 18వ ర్యాంకులో ఉంది. మన పక్క దేశమైన చైనా.... 20వ స్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 20 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి శుభ ఘడియలు
గత ఏడాది 94వ స్థానంలో ఉన్న డ్రాగన్ దేశం ఈసారి 10 పాయింట్లు మెరుగై... 84వ స్థానంలోకి వచ్చేసింది. పాకిస్థాన్ 105వ స్థానంలో ఉంటే... బంగ్లాదేశ్ 101లో ఉన్నాయి. ఆ రెండు దేశాలూ భారత్ కంటే ఆనందంగా ఉన్నట్లు ఈ రిపోర్ట్ చెబుతోంది. అఫ్గానిస్థాన్ (149), జింబాబ్వే (148), రువాండా (147), బోత్సవానా (146), లెసోతో (145) దేశాల్లో ఆనందం చాలా తక్కువగా ఉందని రిపోర్ట్ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, World news