హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Robot cafe : ప్రపంచంలో ఇదే ఫస్ట్..మొత్తం రోబోలతో నడిచే కేఫ్ ఇక్కడ ఉంది!

Robot cafe : ప్రపంచంలో ఇదే ఫస్ట్..మొత్తం రోబోలతో నడిచే కేఫ్ ఇక్కడ ఉంది!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Supermodel robot cafe : సైన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు గంటల తరబడి కష్టపడాల్సిన పని ఇప్పుడు నిమిషాల్లో అయిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Supermodel robot cafe : సైన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు గంటల తరబడి కష్టపడాల్సిన పని ఇప్పుడు నిమిషాల్లో అయిపోయింది, ఎక్కడికి వెళ్లాలని అనుకున్నా గంటల్లో అక్కడికి చేరుకోగుల్గుతున్నాం. దుబాయ్(Dubai) ఇప్పటికే టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇక్కడ మరో అద్భుతం జరగబోతోంది. త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కానున్న డోనా సైబర్-కేఫ్ మానవ ప్రమేయం లేకుండా (Without Huaman)నడుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా వర్క్ ప్లేస్ లు,రెస్టారెంట్స్ లలో రోబోలను వినియోస్తున్నారు. అయితే దుబాయ్ లో ప్రారంభం కానున్న కేఫ్ లో అసలు మనుషులు ఉండరట. పూర్తిగా రోబోల ద్వారా నడుస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రజలకు సర్వీస్ చేయడానికి రోబో యంత్రాలు మాత్రమే ఉంటాయి. ఈ రకమైన మొదటి కేఫ్ ప్రపంచంలో ఇదే ఫస్ట్. ఈ కేఫ్ కి వచ్చే వ్యక్తులు సైన్స్ పురోగతిని చూస్తారు. ఈ కేఫ్ 2023 నాటికి తెరవబడుతుంది.

ప్రపంచంలోని మొట్టమొదటి ఈ సూపర్ మోడల్ రోబోట్ కేఫ్ లో ప్రత్యేకత ఏమిటంటే ఇది 24 గంటలు తెరిచి ఉంటుంది. కస్టమర్లకు సేవ చేయడానికి సూపర్ మోడల్ రోబోట్‌లు ఇక్కడ ఉంచబడతాయి. ఇక్కడ కొన్ని సెల్ఫ్-సర్వ్ ఐస్ క్రీం మెషీన్లు ఉన్నప్పటికీ, కాఫీ రోబోటిక్ చేతుల నుండి మాత్రమే అందుబాటులో ఉంటుంది. డోనా సైబర్-కేఫ్ ఎక్కడ ఉంటుందనేది ఇంకా వెల్లడించనప్పటికీ, దేశంలో ఇలాంటి అనేక కేఫ్‌లు తెరవబడతాయని చెప్పబడింది. ఇక్కడ ఉపయోగించే రోబోట్‌ల భాగాలను రష్యా నుంచి తెప్పించి ఆర్‌డిఐ రోబోటిక్స్ తయారు చేస్తుంది.

Christmas Vacation: క్రిస్మస్ వెకేషన్ ప్లాన్‌ చేస్తున్నారా? వీసా లేకుండా వెళ్లిరాగల 5 బ్యూటిఫుల్‌ కంట్రీస్‌ ఇవే..

మహిళల వ్యక్తిత్వంతో కూడిన సాధారణ రోబోలుగా ఇవి ఉంటాయని రోబో రూపకర్తలు చెబుతున్నారు. అవి తెలివిగా మాత్రమే కాకుండా కొంచెం వ్యంగ్యంగా కూడా ప్రోగ్రామ్ చేయబడ్డాయి, తద్వారా ప్రజలు వారితో సంభాషించడాన్ని ఆనందిస్తారు. ఆ రోబోలు కస్టమర్ల పేర్లు,వారి సంబంధిత సమాచారాన్ని కూడా గుర్తుంచుకోగలరు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనుషుల మాదిరిగానే రోబోలు కూడా మాట్లాడగలవు, కథలు చెప్పగలవు. మనుషుల భావోద్వేగాలను కూడా గుర్తించగలుగుతాయి. ఇప్పుడు ఈ రోబోలు మనుషుల కంటే మెరుగ్గా ఉంటాయో లేదా అనేది చూడాలి.

First published:

Tags: Dubai, Robot

ఉత్తమ కథలు