• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • WORLD DAY OF WAR ORPHANS 2021 WHY WE CELEBRATE WORLD DAY OF WAR ORPHANS EVERY YEAR HERE IS THE HISTORY OF THIS DAY NK GH

World Day of War Orphans 2021: నేడు వరల్డ్ వార్ ఆర్ఫాన్స్‌ డే.. ఆ చిన్నారుల కోసం...

నేడు వరల్డ్ వార్ ఆర్ఫాన్స్‌ డే. (image credit - twitter - Innovation Incubator)

World Day of War Orphans 2021: ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంటోంది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో అనాథలుగా మారుతున్న చిన్నారుల కోసం ఈ రోజును కేటాయించారు.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. వివిధ దేశాల్లో, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి అనాథలుగా మారినవారి సంక్షేమం కోసం నేడు ప్రపంచ అనాథల దినోత్సవం లేదా వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్‌ (World Day of War Orphans)ను నిర్వహిస్తున్నారు. యుద్ధాలు, ఘర్షణల కారణంగా వివిధ దేశాల్లో ఎంతోమంది సాధారణ పౌరులు చనిపోతున్నారు. కొన్ని లక్షలమంది చిన్నారులు అయినవారిని కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి వారిని చేరదీసి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజున అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపేందుకు, వారి సమస్యలను పరిష్కరించడానికి ఏటా జనవరి 6న వార్ ఆర్ఫాన్స్‌ డేను జరుపుతున్నారు. అనాథ పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికి మానసికంగా, సామాజికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని రూపుమాపి, వారి సంక్షేమానికి బాటలు వేయడమే వరల్డ్ వార్ ఆర్ఫాన్స్‌డే లక్ష్యం.

యూనీసెఫ్ సేవలు:
వ్యాధులు, పేదరికం, కరవు, యుద్ధం, తిరుగుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది పిల్లలు అనాథలుగా మారారు. వీరి సంక్షేమం కోసం వార్ ఆర్ఫాన్స్‌ డేను నిర్వహించాలని ఫ్రాన్స్‌కు చెందిన OS ఎన్‌ఫాంట్స్‌ ఎన్ డిట్రెస్స్ (OS Enfants en Detresses) సంస్థ ప్రతిపాదించింది. అభివృద్ధి చెందిన దేశాలలో అనాథల సంఖ్య చాలా తక్కువ. కానీ వివిధ దేశాల్లో యుద్ధాలు, అంటువ్యాధులకు గురైన ప్రాంతాల్లో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని యూనీసెఫ్ (UNICEF) చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా యూరప్‌లో కొన్ని లక్షల మంది చిన్నారులు అనాథలుగా మారారని అప్పట్లో కొన్ని అధ్యయనాలు తెలిపాయి. కేవలం పోలాండ్‌లో మూడు లక్షలమంది, యోగోస్లేవియాలో రెండు లక్షలమంది అనాథలుగా మారారు.


14 కోట్ల మంది అనాథలు:
గత కొన్ని సంవత్సరాలుగా వివిధ దేశాల్లో జరుగుతున్న ఘర్షణల్లో ఎంతోమంది సాధారణ ప్రజలు చనిపోతున్నారు. ఫలితంగా వారి పిల్లలు అనాథలవుతున్నారని UNICEF ప్రచారం చేస్తోంది. యుద్ధాల వల్ల అనాథలైన పిల్లల గురించి అవగాహన పెంచడానికే ఈ సంస్థ... వరల్డ్ వార్ ఆర్ఫాన్స్‌ డేను నిర్వహిస్తోంది. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మంది అనాథలు ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. వీరిలో ఆసియాలో 6.1 కోట్లు, ఆఫ్రికాలో 5.2 కోట్లు, లాటిన్ అమెరికా, కరేబియన్‌ దేశాల్లో 1 కోటి మంది,... తూర్పు ఐరోపా, సెంట్రల్ ఆసియాలో 73 లక్షల మంది ఉన్నారు.

ఇది కూడా చదవండి: Horoscope: ఈ 6 రాశులవారితో తేడా వస్తే తెగతెంపులే... భాగస్వాములూ బీకేర్‌ఫుల్

వరల్డ్ వార్ ఆర్ఫాన్స్‌ డే సందర్భంగా ఇలాంటి ఎంతో మంది పిల్లలకు సహాయం చేయాల్సిన బాధ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తురు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. అలాంటి సంస్థలకు విరాళాలు ఇవ్వడం ద్వారా అనాథ చిన్నారుల కోసం తమ వంతు సాయం చేయాలని వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published: