Home /News /international /

Elon Musk: ఎలాన్ మస్క్ చావుకు భయపడడంటా... కానీ ఎక్కడ చావాలనుకుంటున్నాడో మాత్రం చెప్పాడు..!

Elon Musk: ఎలాన్ మస్క్ చావుకు భయపడడంటా... కానీ ఎక్కడ చావాలనుకుంటున్నాడో మాత్రం చెప్పాడు..!

చావుకు భయపడని ఎలాన్ మస్క్.. ఎక్కడ చనిపోవాలనుకుంటున్నాడో చెప్పాడు..! (PC: Elon Musk/Twitter)

చావుకు భయపడని ఎలాన్ మస్క్.. ఎక్కడ చనిపోవాలనుకుంటున్నాడో చెప్పాడు..! (PC: Elon Musk/Twitter)

జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి కోటీశ్వరులు ఇప్పటికే అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. మరికొంత మంది సైతం స్పేస్ టూర్‌కు ప్రణాళిక కూడా వేసుకుంటున్నారు.

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ (Elan Musk) గురించి ఏదో ఒక వార్త ప్రతి రోజు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన మాట్లాడే ఒక్క మాట, చేసే ఒక్క ట్వీట్ కూడా వివిధ రంగాలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయగలదు. గతంలో ఇలాంటి సందర్భాలను అందరూ చూశారు. అయితే మరో కొత్త అంశంతో ఎలాన్ మస్క్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్‌లో చావు (Death) గురించి వచ్చిన ప్రస్తావనపై ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. తాను చావుకు భయపడనని చెబుతూనే.. ఎక్కడ తుదిశ్వాస విడవాలి అనుకుంటున్న విషయాన్ని సైతం వెల్లడించారు.

జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి కోటీశ్వరులు ఇప్పటికే అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. మరికొంత మంది సైతం స్పేస్ టూర్‌కు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఎలాన్ మస్క్ మాత్రం ఏకంగా అంగారకుడి మీదకు వెళ్లాలని కలలు కంటున్నారు. తాజా ట్విట్టర్‌లో సంభాషణలో సైతం ఈ ప్రస్తావన వచ్చింది. తాను అంగారకుడి మీద తుది శ్వాస విడవాలనుకుంటున్నట్లు చెప్పిన మస్క్... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. @Grimezsz అనే ట్విట్టర్ యూజర్.. మరణం గురించి చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు. "మరణం వచ్చినప్పుడు నేను స్వాగతిస్తాను" అని మస్క్ ట్వీట్ చేశారు. ఆ తరువాత మరో యూజర్.. ‘అంగారకుడి మీదకు వెళ్లకపోయినా చావును స్వాగతిస్తారా?’ అని అడిగాడు. దానికి మస్క్.. తాను అంగారకుడిపై చనిపోవడానికి ప్రాధాన్యం ఇస్తానని స్పందించాడు.



ఎలాన్ మస్క్ ఆలోచనలు సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటాయి. గత రెండు దశాబ్దాలుగా గ్రహాంతర ప్రయాణాల గురించి మస్క్ మాట్లాడుతున్నారు. మనుషులు అంగారకుడిపైకి వెళ్లాలనే లక్ష్యాన్ని ఆయన ప్రోత్సహిస్తుంటారు. ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియాలో లేదా మరే ఇతర ప్లాట్‌ఫాంలలో అయినా సరే.. మస్క్ ఎల్లప్పుడూ మార్స్‌ మీద ఉన్న అభిమానాన్ని చాటుతుంటారు. ఆయన స్థాపించిన స్పేస్ ఎక్స్ స్పేస్ కంపెనీ స్టార్‌షిప్ అనే స్పేస్ క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. పునర్వినియోగానికి పనికొచ్చే ఈ వ్యోమనౌక అంగారకుడిపైకి 100 మందిని తీసుకెళ్లగలదు. ఇటీవల మస్క్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్టార్‌షిప్ ప్రోటోటైప్ ఫోటోను సైతం పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన భవిష్యత్తు లక్ష్యాన్ని, మరణానికి ముడిపెట్టడం నెటిజన్లను ఆకర్షించింది.
Published by:John Naveen Kora
First published:

Tags: Elon Musk

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు