హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

South Korea: సౌత్ కొరియా అధ్యక్ష పదవి రేసులో సామాన్యుడు.. అతడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

South Korea: సౌత్ కొరియా అధ్యక్ష పదవి రేసులో సామాన్యుడు.. అతడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

లీ జే-మ్యుంగ్

లీ జే-మ్యుంగ్

దక్షిణ కొరియా (South Korea)లో అధ్యక్ష ఎన్నికలు (Presidential Election) మార్చి 9, 2022న జరగనున్నాయి. ఒకప్పటి చైల్డ్ ఫ్యాక్టరీ వర్కర్, స్కూల్ డ్రాపౌట్ అయిన జే-మ్యుంగ్ మార్చి 9 జరిగే ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

ఇంకా చదవండి ...

దక్షిణ కొరియా (South Korea)లో అధ్యక్ష ఎన్నికలు (Presidential Election) మార్చి 9, 2022న జరగనున్నాయి. ఈ దేశంలో ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీకి చెందిన మూన్ జే-ఇన్ (Moon Jae-in) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే అతను మరోసారి పోటీ చేయడానికి వీలు లేదు కాబట్టి అతని స్థానంలో మరొక వ్యక్తి బరిలోకి దిగాడు. అతడే లీ జే-మ్యుంగ్ (Lee Jae-Myung). ఒకప్పటి చైల్డ్ ఫ్యాక్టరీ వర్కర్, స్కూల్ డ్రాపౌట్ అయిన జే-మ్యుంగ్ మార్చి 9 జరిగే ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకప్పటి బాలకార్మికుడైన లీ ఇప్పుడు దక్షిణ కొరియాలోని ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా వారి ఆర్థిక సమస్యలను తాను తీర్చగలనని చెబుతున్నారు. ఓటర్లను కన్విన్స్ చేసేందుకు లీ తన హీరోయిక్ రాగ్స్-టు-రిచ్ (Rags To Riches) కథను వినిపిస్తున్నారు.

Ukraine Crisis: యుద్ధంపై భారత్ ఆందోళన.. ఐరాస అత్యవసర భేటీలో Modi సర్కార్ ఇలా


భగ్గుమంటున్న రియల్ ఎస్టేట్ ధరలు, పెరగని వృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యలు ఇప్పుడు సౌత్ కొరియాని కుదేలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సల్ బేసిక్ ఇన్‌క‌మ్ (Universal Basic Income) నుంచి ప్రభుత్వ-నిధులతో జుట్టు రాలిపోయే చికిత్స వరకు అన్నీ తానే సమకూర్చుతానని లీ జే-మ్యుంగ్ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. మాజీ మేయర్, ప్రావిన్షియల్ గవర్నర్ అయిన లీ అనేక అసాధారణ విధానాలను ప్రతిపాదిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Gurmeet Ram Rahim: రేపిస్టు డేరా బాబాకు Z-Plus కేటగిరీ భద్రత.. BJP సర్కార్ అనూహ్య ఉత్తర్వులు


పేదరికం అనుభవించిన తనకు పేదవారు ఎలాంటి బాధలు పడుతున్నారో తెలుసునని... ఆ సమస్యలను సమూలంగా పరిష్కరించగలరని లీ జే-మ్యుంగ్ తన ప్రచారంలో చెబుతున్నారు. సౌత్ కొరియాలో అధ్యక్షుడు అయిన వాళ్లలో చాలా వరకూ ధనికులే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ దేశాన్ని మారుస్తానని చెప్పడంతో ఆయన ప్రచారానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు ఉచిత డబ్బుతో ఓట్లను కొనడానికి లీ ప్రయత్నిస్తున్నారని.. ఆయన నెక్స్ట్ జనరేషన్ ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టివేస్తారని ప్రతిపక్షం లీ ప్రతిపాదనలను ఖండించింది. వరుస కుంభకోణాలు కూడా లీ గెలుపుకు అడ్డంకిగా మారాయి. అతని భార్య ప్రజానిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఒక ల్యాండ్ డెవలప్మెంట్ డీల్ లో కూడా అతన్ని అధికారులు అనుమానిస్తున్నారు. మాఫియా సంబంధాల గురించి కూడా పుకార్లు ఉన్నాయి. ఈ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ తన తమ్ముడిని బలవంతంగా మెంటల్ హాస్పిటల్ లో చేర్పించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే లీ పేదరికం నుంచి వచ్చినవాడినే కథ నిజమా అబద్దమా అనే దానిపై కూడా అనుమానాలున్నాయి.

ప్రతిపక్ష పార్టీ అయిన పీపుల్ పవర్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా యున్ సుక్-యోల్ (Yoon Suk Yeol) పోటీ చేస్తున్నారు. మంగళవారం విడుదలైన ఒక సర్వేలో యూన్ 2.5 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. రాబోయే రెండు టెలివిజన్ డిబేట్‌లలో అభ్యర్థుల పనితీరు ఎలా ఉంటుంది?? స్వింగ్ ఓటర్లను ఆకర్షించడానికి వారు తాము చెప్పదలుచుకున్నది ఎలా చెప్తారు?? అనేది నిర్ణయాత్మకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుడు పార్క్ సాంగ్-బ్యోంగ్ చెప్పారు.

1970 కాలంలో తన చిరుప్రాయంలోనే లీ గ్లోవ్ ఫ్యాక్టరీలో పని చేశాడు. లీ మీడియాతో మాట్లాడుతూ... "1970 కాలం అణచివేత యుగం. ఆ కాలంలో మిలటరీ యూనిఫాం ధరించిన మేనేజర్లు జూనియర్ కార్మికులను కొట్టేవారు. నేను మేనేజర్‌గా మారితేనే దెబ్బల నుంచి నన్ను నేను రక్షించుకోగలనని భావించాను. మేనేజర్ అవ్వాలంటే హైస్కూల్ డిగ్రీ అవసరమయ్యేది" అని చెప్పాడు. 13 ఏళ్ల వయసులో తన చేయి ఒక క్రషర్ లో పడి శాశ్వత వికలాంగుల అయ్యారు లీ. తన పరిస్థితిని చూడలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ నైట్ స్కూలు, లా స్కూల్ స్కాలర్‌షిప్ అతని జీవితంలో ఒక ఆశా కిరణాన్ని చూపించాయట.

Ukraine Crisis: యుద్దం ఆరంభం.. ఉత్తర్వులపై బైడెన్ సంతకం.. రష్యాపై అమెరికా భారీ ఆంక్షలు..


2010లో రాజకీయాల్లోకి రాకముందు ఆయన మానవ హక్కుల న్యాయవాది (Human Rights Lawyer)గా అవతారమెత్తారు. రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత లీ ఉచిత స్కూల్ యూనిఫారాలు, ఉచిత ప్రసూతి సంరక్షణ (Free Maternity Care)ను కూడా అందించారు. 2020 ప్రారంభంలో తన నియోజకవర్గాలకు సహాయ నిధులను అందించారు. వచ్చే నెలలో గెలిస్తే, తన యూనివర్సల్ బేసిక్ ఇన్‌క‌మ్ స్కీమ్ ని విస్తరింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఎవ్రీ అడల్ట్ (Every Adult)కి ప్రతి యేటా 1 మిలియన్ వాన్ ($835) ఇస్తానని చెప్పారు.

First published:

Tags: Elections, Politics, President, South korea