హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Work from Home ముగిసింది..ఉద్యోగులకు మస్క్ వార్నింగ్..ఆఫీస్ కు రండి,లేదంటే గెట్ ఔట్

Work from Home ముగిసింది..ఉద్యోగులకు మస్క్ వార్నింగ్..ఆఫీస్ కు రండి,లేదంటే గెట్ ఔట్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్

Tesla CEO Elon Musk: కోవిడ్ నేపథ్యంలో చాలా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోమ్ విధానం అనుసరిస్తున్నాయి పలు సంస్థలు. ఇందులో టెస్లా కూడా ఉంది. టెస్లా ఉద్యోగులుల్లో కూడా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

Tesla CEO Elon Musk: కోవిడ్ నేపథ్యంలో చాలా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్(Work From Home) విధానాన్ని ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోమ్ విధానం అనుసరిస్తున్నాయి పలు సంస్థలు. ఇందులో టెస్లా కూడా ఉంది. టెస్లా ఉద్యోగులుల్లో కూడా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వీరిలో కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు.వాళ్లను ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఎలన్ మస్క్ ఎప్పట్నుంచో కోరుతున్నారు.అయితే, ఇంకా చాలా మంది ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అసలు వాళ్లు ఆఫీసుకు వస్తారా? లేదా? అనే చర్చ కూడా నడుస్తోంది.ఈ నేపథ్యంలో డైరెక్టుగా ఎలన్ మస్క్(Elon Musk) రంగంలోకి దిగాడు. ఇక నుంచి వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కుదరదని..తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని.. లేదంటే టెస్లాను వీడిపోవచ్చంటూ ఉద్యోగులను మస్క్ ఘాటుగా హెచ్చరించారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు సంబంధించి గట్టి వార్నింగ్ ఇస్తూ ఎలన్ మస్క్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

టెస్లా(Tesla) ఉద్యోగలుకు పంపిన మెయిల్ లో మస్క్.."ఇతర ప్రాంతం నుంచి పనిచేయడం ఇక నుంచి ఆమోదయోగ్యం కాదు. రిమోట్‌ వర్క్‌ చేయాలి అని ఎవరైనా అనుకుంటే వారంలో కనీసం 40 గంటలు కార్యాలయంలో ఉండాల్సిందే. లేదంటే టెస్లా నుంచి వెళ్లిపోవచ్చు. ఫ్యాక్టరీ కార్మికులకు చెప్పిన దానికంటే ఇది చాలా తక్కువ. ఆఫీస్‌ అంటే ప్రధాన కార్యాలయమే. విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీలు కాదు" అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎరైనా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలనుకుంటే వాళ్ల పరిస్థితులు గమనించి అవసరం అనుకుంటేనే అనుమతి ఇస్తానని చెప్పినట్టూ తెలుస్తోంది. గతంలో ట్విటర్‌లో నెటిజన్ ఈ విషయమై మస్క్‌ని ప్రశ్నించగా, ఆఫీస్‌కి వచ్చి పని చేస్తేని మంచిదన్న ఉద్దేశం వచ్చేలా రిప్లై ఇచ్చారాయన. అప్పటి నుంచి టెస్లా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాల్సి వస్తుందేమోనని కలవర పడుతూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా బాస్ నుంచి ఈ-మెయిల్ వచ్చే సరికి అంతా ఉలిక్కిపడినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, సంస్థ ఉద్యోగుల పట్ల ఎలాన్‌ మస్క్‌ కఠినంగానే వ్యవహరిస్తారని వార్తలున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను ఆయనతో పనిచేసిన వారు గుర్తుచేసుకుంటున్నారు. ప్రొడక్టివిటీ విషయంలో ఎలన్ మస్క్ చాలా నిక్కచ్చిగా ఉంటారని ఆయన సన్నిహితులు చాలా సందర్భాల్లో చెప్పారు. మరోవైపు షాంఘైలో లాక్‌డౌన్‌ కారణంగా అక్కడున్న టెస్లా కార్యాలయంలో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కార్మికుల చేత వారానికి ఆరు రోజులపాటు పని చేయించడం, నిత్యం 12 గంటలు పని చేయిస్తున్నారని తెలుస్తోంది. కరోనా ఉద్ధృతి వేళ క్లోజ్‌డ్‌ లూప్‌ మానిఫాక్చరింగ్‌ సిస్టమ్‌లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న టెస్లా సిబ్బంది.. అలసిపోయి ఫ్యాక్టరీ నేలపైనే పడుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌పై ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది.

First published:

Tags: Elon Musk, Tesla Motors, Work From Home, Work from office

ఉత్తమ కథలు