అది తోడేలు కాదు కుక్క... జూ అధికారులపై పర్యాటకుల ఫైర్... అసలు విషయమేంటంటే...

ప్రతీకాత్మక చిత్రం

China Zoo : చైనాలో ఆ జూ అధికారులు తోడేలు ఉండే ఎన్‌క్లోజర్‌లో కుక్కను ఉంచారు. దాన్ని చూసిన పర్యాటకులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ తర్వాతేమైంది...

  • Share this:
ఇది చైనాలోని జ్యుయ్‌ఫెంగ్ ఫారెస్ట్ జూ అధికారుల నిర్వాకం. తోడేలు ఉండే ఎన్‌క్లోజర్‌లో... కాస్త దూరంలో... చీకటి ప్రదేశంలో... కనిపించీ, కనిపించనట్లుగా ఓ జంతువు కనిపిస్తోంది. అది తోడేలు ఎన్‌క్లోజర్ కావడం వల్ల... విజిటర్లు అదిగో తోడేలు అనుకుంటూ అలా అలా ముందుకెళ్లిపోతున్నారు. ఐతే... నిజానికి అది కుక్క. ఒకానొక సందర్భంలో... ఆ చీకటి నీడలో జంతువు కుక్కలాగా అరిచింది. అంతే... పర్యాటకులకు డౌట్ వచ్చింది. తోడేలు... కుక్కలాగా అరవదే అని అనుకున్నారు. అమ్మో మనల్ని మోసం చేస్తున్నారు... తోడేలు బదులు కుక్కను పెట్టి... చీటింగ్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. జూ అధికారుల దగ్గరకు వెళ్లి... నిలదీశారు. అప్పుడు ఆ అధికారులు చెప్పిన విషయం తెలుసుకొని షాకవ్వడం పర్యాటకుల వంతైంది.

అసలేం జరిగిందంటే... ఆ జూలో చాలా తోడేళ్లు ఉండేవి. వాటిలో ఓ మగ తోడేలును మిగతా తోడేళ్లు రెండేళ్ల కిందట గాయపరచడంతో దాన్ని విడిగా ఈ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఆ తోడేలును ఒంటరిగా ఉంచితే, అది మరింత దిగులు చెందుతుందన్న ఉద్దేశంతో... దానికి తోడుగా కొన్ని ఆడ కుక్కలను కూడా ఉంచారు. వాటిలో ఓ కుక్కతో అది చక్కగా ఉండటంతో మిగతా కుక్కల్ని తొలగించారు. పర్యాటకులు చూసిన రోజున ఆ తోడేలు లోపలికి వెళ్లి... దాని గూటిలో నిద్రపోతోంది. ఆ కుక్క మాత్రం నిద్రపోకుండా... పర్యాటకులకు కనిపిస్తోందన్నమాట. ఈ విషయం తెలియని పర్యాటకులు సహజంగానే సీరియస్ అయ్యారు.

రెండేళ్లుగా ఆ తోడేలూ, కుక్క ఒకే బోనులో చక్కగా ఉంటున్నాయట. ఐతే... చైనాలో ఇలా ఒక జంతువుకు బదులు మరో జంతువును చూపిస్తున్న ఘటనలు ఇదివరకు రెండు జరిగాయి. 2017లో గిషాన్ జూలో... నిజమైన పెంగ్విన్లకు బదులు... బొమ్మ పెంగ్విన్లు పెట్టారు. యుహె జూలో సైబీరియా టైగర్ ఉండే ఎన్‌క్లోజర్‌లో కుక్కను ఉంచారు. ఇలాంటి ఘటనలు పర్యాటకులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

స్టోన్‌హెంజ్ మిస్టరీ వీడబోతోందా... మిస్సింగ్ అయిన రాయి ఏం చెబుతోంది...


వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం


ఉండవల్లికి గాలం వేస్తున్న టీడీపీ... వైసీపీ వదులుతుందా... ?

దొనకొండపై వైసీపీ నేతల దృష్టి... జోరుగా భూముల కొనుగోళ్లు...
First published: