Home /News /international /

WOMEN CANT FLY WITHOUT MALE RELATIVE SAYS TALIBAN ORDER PVN

Taliban New Order: మహిళల విమాన ప్రయాణాలపై తాలిబన్ సంచలన నిర్ణయం

 ఆఫ్గనిస్థాన్

ఆఫ్గనిస్థాన్

Taliban New Order : కాబూల్ విమానాశ్రయంలో టిక్కెట్లు ఉన్న కొంతమంది మహిళలను తిప్పి పంపామని అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్, దుబాయ్, టర్కీ దేశాలకు వెళ్లడానికి కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అనేకమంది మహిళలను తాలిబన్‌ ప్రభుత్వ ఆదేశాల వల్ల విమానాలు ఎక్కనివ్వలేదని ఎయిర్‌పో ర్టు అధికారులు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
Taliban New Order On Women Air Travel : అప్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని తాలిబన్లు(Taliban) చేసిన ప్రకటనలు నీటిమూటగా మారింది. గతంలో బాలికలను ఆరో తరగతి తరవాత హైస్కూళ్లకు పంపకూడదనే నిషేధాన్ని ఎత్తివేస్తామని చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించిన తాలిబన్‌ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విమానాల్లోకి మహిళలకు అనుమతించేది లేదంటోంది. మహిళల విమాన ప్రయాణాలపై తాజాగా తాలిబన్ సర్కారు జారీ చేసిన ఆదేశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మగ తోడు లేకుండా మహిళలు దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించకూడదని( చదువు కోసం విదేశాలకు వెళ్లే మహిళలతో సహా) అఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మహిళల ప్రయాణాలపై కొత్త ఆంక్షలు విధించామని అఫ్ఘాన్ సర్కారు విమానయాన సంస్థలకు పంపిన లేఖలో తెలిపింది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న తోడులేని మహిళలను ఆది, సోమవారాల్లో ప్రయాణానికి అనుమతించినట్లు అప్ఘాన్ విమాన యాన రంగ అధికారులు తెలిపారు.

శనివారం కాబూల్ విమానాశ్రయంలో టిక్కెట్లు ఉన్న కొంతమంది మహిళలను తిప్పి పంపామని అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్, దుబాయ్, టర్కీ దేశాలకు వెళ్లడానికి కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అనేకమంది మహిళలను తాలిబన్‌ ప్రభుత్వ ఆదేశాల వల్ల విమానాలు ఎక్కనివ్వలేదని ఎయిర్‌పో ర్టు అధికారులు వెల్లడించారు. పురుషుల తోడు లేకుండా వారు విమాన ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేశారు. కొంత సేపటి తర్వాత కొందరు మహిళలు ఒంటరిగా హెరాత్‌ వెళ్లే విమానం ఎక్కడానికి తాలిబన్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఆ విమానం ఆలస్యంగా రావడంతో వారు ఎక్కకముందే అది ఎగిరిపోయింది. ప్రయాణాలకు మహిళల వెంట మగ తోడు ఉండాలనే నిబంధనపై అఫ్ఘాన్ మహిళలు, హక్కుల సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Afghanistan, Taliban, Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు