స్లీపింగ్ సిండ్రోమ్... కంటిన్యూగా 3 వారాలు నిద్రపోయింది... ఎగ్జామ్స్‌ మిస్సైంది...

Sleeping Beauty Syndrome : ప్రపంచంలో రకరకాల జబ్బులు. వాటిలో ఇదొకటి. ఇది ఎలా వస్తుందో, వస్తే ఏమవుతుందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: March 26, 2019, 1:02 PM IST
స్లీపింగ్ సిండ్రోమ్... కంటిన్యూగా 3 వారాలు నిద్రపోయింది... ఎగ్జామ్స్‌ మిస్సైంది...
రోడా (Image : Twitter)
  • Share this:
పేరు రోడా రోడ్రిక్వెజ్ డయాజ్. వయసు 21 సంవత్సరాలు. బ్రిటన్‌లోని లెసెస్టర్ యూనివర్శిటీలో చదువుకుంటోంది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. బాగా చదివి పరీక్షలు రాయాలనుకుంది. ఇంకో వారంలో పరీక్షలనగా... నిద్రలోకి జారుకుంది. అంతే... మూడు వారాల పాటూ కంటిన్యూగా నిద్రపోయింది. కారణమేంటంటే... రోడాకి అరుదైన స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ ఉంది. మెడికల్ భాషలో దీన్ని క్లెయిన్ లెవిన్ సిండ్రోమ్ (The Kleine-Levin Syndrome) అంటారు. ఇది ఉన్నవాళ్లు... రోజుకి 22 గంటల పాటూ నిద్రపోతారు. పది లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు భోజనం చేస్తున్నా, టాయిలెట్‌కి వెళ్లినా... నిద్ర మత్తు ఉంటుంది. కలలు వస్తూనే ఉంటాయి. అందువల్ల వీళ్లు మన ప్రపంచంలో ఉన్నట్లుగా ఫీలవ్వరు. మెలకువ ఉన్నట్లు అస్సలు అనిపించదు. నిద్ర మత్తు వీడదు. రోడాకీ అదే జరిగింది. ఆమె ఏకంగా మూడు వారాలపాటూ కంటిన్యూగా నిద్రపోయిందట. ఫలితంగా ఎగ్జామ్స్ మిస్సైంది.

రోడాను చూసిన వాళ్లంతా ఆమె సమస్యేంటో తెలీక... బద్దకిష్టు అని అంటుంటారు. ఎప్పుడూ లేజీగా కనిపిస్తుంటుంది. అసలా సమస్య నుంచీ ఎలా బయటపడాలో ఆమెకు తెలియట్లేదు. ఒక్కోసారి తనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. నాకే ఎందుకిలా అవ్వాలి అని అనుకుంటూ ఉంటుందట.

చిన్నప్పటి నుంచే రోడాకు ఈ సమస్య ఉంది. నాలుగేళ్ల వయసులోనే వారాల తరబడి అలా నిద్రపోయేదట. దీన్ని సింపుల్‌గా హైపర్ ఇన్‌సోమ్నియా అని పిలుస్తున్నారు. 2018 సెప్టెంబర్‌లో డాక్టర్లు ఆమెలో ఈ జబ్బును గుర్తించారు. ఈ జబ్బు వల్ల రోడా ఎంతో జీవితాన్ని కోల్పోతోంది. ఎన్నో రోజులు అలా అలా గడిచిపోతున్నాయి. ప్రతి రోజూ బాధపడుతూనే ఉంటుంది. డాక్టర్లు మాత్రం ఈ జబ్బుకి మందు లేదంటున్నారు. అసలామెకు ఇలా ఎందుకవుతోందో తెలియదంటున్నారు.


రోడాకి 15 ఏళ్లు వచ్చినప్పటి నుంచీ నిద్ర మత్తు మరింత ఎక్కువైంది. కొన్ని రోజులు నిద్రపోయాక... మెలకువ వచ్చాక... ఆమె నార్మల్ గానే ఉంటుంది. మళ్లీ నిద్రలోకి జారుకుంటే చాలు... కొన్ని రోజుల పాటూ లేదా వారాలపాటూ నిద్రపోతోంది. ఇలాంటి జబ్బులు కూడా ఉన్నాయంటే నమ్మలేం.

 

ఇవి కూడా చదవండి :

వైసీపీ మేనిఫెస్టోపై జగన్ దృష్టి... టీడీపీకి దెబ్బకొట్టేలా ఉండబోతోందా?ఆ పార్టీలో అందరూ మహిళలే... దేశంలోనే మొదటిది... ముంబైలో ప్రారంభం

ఆ బాలికల్ని వాళ్ల కుటుంబాలకు అప్పగించాల్సిందే... పాకిస్థాన్ ప్రధానికి సుష్మాస్వరాజ్ వార్నింగ్

తేజశ్వినికి షాక్... బెంగళూరు సౌత్‌కి తేజశ్వి సూర్యను ఎంపిక చేసిన బీజేపీ
First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading