Viral Video: ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తారా.. నడి రోడ్డు మీదే చుక్కలు చూపించింది..

(Image Credit: Nest)

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

  • Share this:
    ఓ మహిళ తన భర్తపై కారు ఎక్కించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. అతని ఎలాగైనా కారుతో తొక్కించాలని చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే ఈ ఘటన మేరిలాండ్‌లో జరిగినట్టు Gulf Today రిపోర్ట్ చేసింది. భార్యభర్తలు ఇద్దరు సోషల్ మీడియా పరిచయంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరు మేరీలాండ్‌ బాల్టిమోర్‌లోని రెసిడెన్షియల్ స్ట్రీట్‌లో.. రోడ్డు మధ్యలో ఉండి గొడవపడ్డారు. అనంతరం భార్య కారులోనే కూర్చుని ఉండగా.. కారు వెనకాల డిక్కీలో నుంచి వస్తువులను తీసుకోవడం ప్రారంభించాడు. అయితే కారులో ఉన్న భార్య.. ఒక్కసారిగా కారును వెనక్కి పోనిచ్చింది. భర్తపైకి కారు ఎక్కించాలని చూసింది. కారు తన మీదకు దూసుకురావడంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అయితే చివరకు కారు తనపైకి ఎక్కుకుండా తప్పించుకోగలిగాడు.

    ఆ తర్వాత కూడా ఆమె.. తన భర్తపైకి పలుమార్లు కారు ఎక్కించాలని చూసింది. దీంతో అతడు పరిగెత్తాడు. ఈ క్రమంలోనే అతడి చర్యలు.. కారులో ఉన్న భార్యను రెచ్చగొట్టేవిగా కనిపించాయి. ఇలా పలుమార్లు భార్య కారు ఎక్కించేందుకు ప్రయత్నించినా.. అతడు విజయవంతంగా తప్పించుకోగలిగాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు.





    ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మహిళ.. మరీ ఓవర్ చేసిందని అంటుండగా, మరికొందరు మాత్రం భర్త.. ఆమెను రెచ్చగొట్టాడని మండిపడుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: