ఓర్నాయనో... నూడుల్స్ ఇలా కూడా వండుతారా... సూపర్ వైరల్ వీడియో

నూడుల్స్ రకరకాలుగా వండే వాళ్లను మీరు చూసి ఉంటారు.... కానీ... నూడుల్స్ వండుతూ... డాన్స్ చేస్తూ... షాకిచ్చే యువతిని మాత్రం ఇప్పుడే చూస్తున్నారు.

news18-telugu
Updated: October 14, 2020, 2:20 PM IST
ఓర్నాయనో... నూడుల్స్ ఇలా కూడా వండుతారా... సూపర్ వైరల్ వీడియో
ఓర్నాయనో... నూడుల్స్ ఇలా కూడా వండుతారా... సూపర్ వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
వైరల్ వీడియోల్లో రకరకాలు. ఇప్పుడు మనం చూడబోయేది షాకింగ్ సూపర్ వైరల్ వీడియో. ఇలా ఎందుకు అంటున్నానంటే... ఇందులో ఓ యువతి అదిరిపోయే మ్యూజిక్ పెట్టుకొని... నూడుల్స్ వండుతోంది. ఐతే... ఆ మ్యూజిక్ సాంగ్‌కి తగ్గట్టు డాన్స్ చేస్తోంది. ప్యాన్‌ని తీసుకొని... గిరగిరా తిరిగేసింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టిందే గానీ... దాన్ని కుదురుగా ఉంచితే ఒట్టు... అటు కదిపీ, ఇటు కదిపీ... నానా హంగామా చేసింది. గరిట చేయాల్సిన పనిని తాను చేసినట్లైంది. ఇదంతా చూసిన వాళ్లు... వామ్మో నూడుల్స్ ఇలా కూడా వండుతారా... ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అంటున్నారు.

అసలు ఆమె ఇలా గంగ్నమ్ స్టైల్ డాన్స్ ఎందుకు వేసింది... అంటే... అందర్నీ ఆకట్టుకోవడానికే. రొటీన్‌గా నూడుల్స్ వండితే... అసలీ వీడియో వైరల్ అయ్యేదే కాదు, మనం చర్చించుకునేవాళ్లమూ కాదు. ఆశ్చర్యమేంటంటే... ఆమె నూడుల్స్ ప్యాన్‌ను గిరగిరా తిప్పినా... అందులో నూడుల్స్ కింద పడకుండా అలాగే ఉన్నాయి. చుట్టూ ఉన్న వాళ్ల మీద కూడా పడలేదు.నిజానికి ఇదో డేంజరస్ స్టంట్ అనుకోవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు చెయ్యాలంటే... చాలా ట్రైనింగ్ ఉండాలి. కొత్త వాళ్లెవరైనా ఇలా చేశారంటే... ఆ వేడి వేడి నూడుల్స్ వారి పైనే పడే ప్రమాదం ఉంటుంది.ఈ వీడియో ట్విట్టర్‌లో సూపర్ వైరల్ అయ్యింది. 91 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంకా వరదలా వస్తూనే ఉన్నాయి. ఆమె చాలా సార్లు ప్రాక్టీస్ చెయ్యబట్టే అంతబాగా చెయ్యగలిగింది అని నెటిజన్లు అంటున్నారు. "అసలు ఎవరికైనా ఇలాంటివి చెయ్యాలనే ఆలోచనలు ఎలా వస్తాయో" అని ఓ నెటిజన్ ఆశ్చర్యపోగా... "నేను కచ్చితంగా చెప్పగలను... ఆమె బాగా చేసింది... కానీ ఆమె ఒక్కసారి ఫెయిలైనా... ఆ నూడూల్స్ అందరి పైనా పడతాయి" అని మరో నెటిజన్ అన్నారు.


ఆమె ఇలాంటివి చాలా చేస్తోంది. తన టిక్ టాక్ అకౌంట్ కీలీ86 (keeley86)లో ఇలాంటివి చాలా వంటల వీడియోలు పెట్టింది.
Published by: Krishna Kumar N
First published: October 14, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading