కుక్క మూతిపై ఎంగేజ్‌మెంట్ రింగ్ పెట్టింది... ఆ తర్వాత షాకైంది... వైరల్ వీడియో

కొంతమంది ఏదైనా కొత్తగా చెయ్యాలనుకుంటారు. అది మంచిదే కానీ ఒక్కోసారి శ్రుతి మించితే... మొత్తానికీ తేడా కొడుతుంది. ఆ యువతి విషయంలో అదే జరిగింది.

news18-telugu
Updated: October 14, 2020, 1:24 PM IST
కుక్క మూతిపై ఎంగేజ్‌మెంట్ రింగ్ పెట్టింది... ఆ తర్వాత షాకైంది... వైరల్ వీడియో
కుక్క మూతిపై ఎంగేజ్‌మెంట్ రింగ్ పెట్టింది... (credit - twitter)
  • Share this:
చాలా మంది తాము పెంచుకునే కుక్కల్ని మనుషుల లాగే ట్రీట్ చేస్తారు. వాటిని బెడ్‌పై తమతో పాటూ పడుకోనిస్తారు. ప్రతి పనిలో వెంట కుక్క ఉండేలా చేసుకుంటారు. అలా కుక్కపై విపరీతమైన అభిమానం ఉన్న ఓ యువతికి ఆ కుక్కే షాక్ ఇచ్చింది. అసలేమైందంటే... ఆ యువతి... తన ఎంగేజ్‌మెంట్ డైమండ్ రింగ్‌ను వీడియో ద్వారా అందరికీ చూపించాలని అనుకుంది. చేతికి ఉన్న రింగును డైరెక్టుగా చూపిస్తే సరిపోయేది కానీ అలా చెయ్యలేదు. పక్కనే ఉన్న తన గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క మూతిపై ఆ రింగును ఉంచింది. కదలకుండా ఉండు (స్టే) అని ఆర్డర్ వేసింది. ఆ కుక్క ఆదేశాన్ని పాటించింది. రింగును ఉంచగానే... ఆశ్చర్యపోతూ... కదలకుండా ఉండిపోయింది. పోనీలే రింగ్ అందరకీ బాగా కనిపిస్తుంది అనుకుంది ఆమె. తీరా చూస్తే... ఆ కుక్క... ఒక్క క్షణంలో ఆ రింగును మింగేసింది.

రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సూపర్ వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియో చూసి ఆమెను తిడుతున్నారు. ఆమె చాలా స్టుపిడ్ లా వ్యవహరించిందని అంటున్నారు. ఎవరైనా ఇలా చేస్తారా అని తిట్టిపోస్తున్నారు.

WCGW if I try to show off my new engagement ring? from r/Whatcouldgowrong


"ఇప్పుడా రింగ్ కుక్క పొట్టలో ఉన్నట్లు లెక్క. అది ఎలాగూ అరగదు. మూత్రాశయం ద్వారా అది బయటకు వచ్చేస్తుంది. కానీ దాన్ని తిరిగి ఆమె పొందుతుందని నేను అనుకోవట్లేదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "ఆమెకు అలా జరగాల్సిందే. ఎవరైనా తినకూడని వస్తువుల్ని జంతువులకు ఇస్తారా... బుద్ధుందా" అని మరో యూజర్ ఫైర్ అయ్యారు.

మొత్తానికి ఈ వీడియో నవ్వు తెప్పించట్లేదు. పైగా... ఇకపై ఇలా చెయ్యకూడదని మిగతా వాళ్లకు ఓ హెచ్చరికలా మారింది. పెంపుడు జంతువుల్ని పెంచుకుంటూ ఇలాంటివి చేసేవారికి ఈ వీడియో ఎంతో కొంత అలర్ట్ నెస్ తెస్తుందనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: October 14, 2020, 1:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading