షాకింగ్.. ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసిన మహిళ.. తీరా పార్శిల్ వచ్చాక చూస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్‌లో ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది.

 • Share this:
  ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం అనేది ఈరోజుల్లో చాలా కామన్‌ అయిపోయింది. ముఖ్యంగా  ఉద్యోగుస్తులు, వంట చేసుకోవడానికి తీరిక లేనివారు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌లో ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే.. ఆమె ఫ్రై చేసిన టవల్ వచ్చింది. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు..ఆలిక్ పెరెజ్( Alique Perez) అనే మహిళ మంగళవారం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్ ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. పార్శిల్ రాగానే అందులో నుంచి చికెన్ తీసి తన కొడుకుకు తినిపిద్దాం అనుకుంది. తీరా తనకు వచ్చిన ఫుడ్ డెలివరీ పార్శిల్ చూసి ఆమె షాక్ తింది. ఈ ఘటనతో తాను చాలా డిస్టర్బ్ అయినట్టు ఆలిక్ చెప్పుకొచ్చారు.

  ఇందుకు సంబంధించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఆర్డర్ చేసిన ఫ్రైడ్ చికెన్ డెలివరీ అప్పటికే చాలా ఆలస్యమైందనే అసంతృప్తిలో ఉన్నాను. తీరా ఆర్డర్ వచ్చాక నాకు చాలా కోపం కలిగింది. మా అబ్బాయి కోసం చికెన్ ఆర్డర్ చేశాను. తనకు ఓ పీస్‌ కట్‌ చేసి ఇద్దామని ప్రయత్నించాను. కానీ కట్‌ అవ్వడం లేదు. దాంతో అనుమానం వచ్చి నా భర్తను పిలిచాను. కట్ కావడం లేదని చూడమన్నాను. ఆయన మొత్తం తెరిచి చూస్తే బాగా ఫ్రై చేసిన టవల్ కనిపించింది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తీవ్రమైన కోపం వచ్చింది. జొల్లిబీ రెస్టారెంట్‌ చేసిన పనికి నాకు చాలా అసహ్యమేసింది’అని ఆలిక్ సోషల్ మీడియాలో పేర్కొంది.

  Viral Video: రొట్టెలు చేస్తున్న యువతి.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న వీడియో.. ఆ స్మైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

  మరోవైపు ఈ ఘటనపై జొల్లిబీ రెస్టారెంట్ స్పందించింది. Bonifacio గ్లోబల్ సిటీలో తమ బ్రాంచ్‌ను జూన్ 3 నుంచి మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జరిగిన తప్పిదంపై విచారం వ్యక్తం చేసింది. ఇలా జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
  Published by:Sumanth Kanukula
  First published: