WOMAN RENTS OUT HER HUSBAND TO OTHER WOMEN AS HE IS HANDY AROUND THE HOUSE PVN
Woman rents out her husband : డబ్బు కోసం భర్తను మహిళలకు అద్దెకిస్తున్న భార్య.. ధర తక్కువే!
భర్తను అద్దెకు ఇస్తోన్న భార్య
Woman rents out her husband : ఎక్స్ ట్రా మనీ కోసం ఒక మహిళ తన భర్తను అద్దెకు ఇస్తోంది. అది కూడా తక్కువ ధరకే. ఇందుకోసం ఆమె "హైర్ మై హ్యాండీ హబ్బీ"అనే వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది.
Woman rents out her husband : ఎక్స్ ట్రా మనీ కోసం ఒక మహిళ తన భర్తను అద్దెకు ఇస్తోంది. అది కూడా తక్కువ ధరకే. ఇందుకోసం ఆమె "హైర్ మై హ్యాండీ హబ్బీ"అనే వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. ఇతరుల కోసం ఫ్లాట్ ప్యాక్ ఫర్నీచర్ పెట్టడం ద్వారా జీవనోపాధి పొందిన వ్యక్తి గురించి పాడ్‌క్యాస్ట్ విన్న తర్వాత ఆమెకు ఈ ఐడియా వచ్చింట. ఇంతకు ఆ మహిళ ఎవరకు,భర్తను అద్దెకు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదివేండి.
బ్రిటన్ లోని బకింగ్హామ్షైర్లో నివసించే లారా-జేమ్స్ భార్యాభర్తలు. వీకి ముగ్గురు పిల్లలు. అయితే జేమ్స్ కి చాలా పనులలో మంచి నైపుణ్యం ఉంది. ఇంటికి సంబంధించిన చాలా పనులు చేయడంలో అతనిది అందవేసినచేయి. డూ-ఇట్-యువర్సెల్ఫ్ ప్రాజెక్ట్‌లలో నిపుణుడు. అతని సామర్థ్యాలకు వారి ఇల్లు ఒక ప్రధాన ఉదాహరణ. సాంప్రదాయ బెడ్లను నిర్మించడం,కిచెన్ ఫిట్టింగ్,స్క్రాచ్ నుంచి డైనింగ్ టేబుల్ చేయడం వంటి పనుల ద్వారా జేమ్స్ తన బకింగ్‌హామ్‌షైర్ ఇంటిని మార్చారు. పెయింటింగ్, అలంకరణ, టైల్ వేయడం, కార్పెట్ ఇన్‌స్టాలేషన్‌లో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు జేమ్స్. ఇంట్లో,గార్డెన్ కి సంబంధించిన పనులలో అతడు మంచి నైపుణ్య కలి ఉన్న నేపథ్యంలో తన ఆ నైపుణ్యాలను సామర్థ్యాలను ఎలా ఎక్కువగా ఉపయోగించుకోగలదో భార్య లారా త్వరగా గ్రహించింది. ఈ నేపథ్యంలో స్వంతంగా "హైర్ మై హ్యాండీ హబ్బీ" వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఫేస్బుక్, ప్రముఖ నెక్స్ట్డోర్ యాప్‌లో ప్రచారం చేసింది.
లారా మాట్లాడుతూ, "ప్రజలు దీనిపట్ల నిజమైన ఆసక్తిని కలిగి ఉన్నారు. అయితే కొంతమందికి తప్పుడు ఆలోచన వచ్చింది. నేను జేమ్స్‌ను పూర్తిగా వేరొకదాని కోసం అద్దెకు ఇస్తున్నాను అని భావించారు" అని తెలిపింది. ఇతరుల కోసం ఫ్లాట్ ప్యాక్ ఫర్నీచర్ పెట్టడం ద్వారా జీవనోపాధి పొందిన వ్యక్తి గురించి పాడ్‌క్యాస్ట్ విన్న తర్వాత ఈ ప్రత్యేకమైన ఆలోచన తనకు వచ్చినట్లు లారా తెలిపింది. లారా మాట్లాడుతూ.."జేమ్స్ ఎల్లప్పుడూ నిర్మించడం, సృష్టించడం పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటాడు. నేను అతనిని సంవత్సరాలుగా మా స్వంత ఇంటిని రెడీ చేయడంలో,స్నేహితులు,కుటుంబ సభ్యులకు సహాయం చేయడంలో బాగా ఉపయోగించాను" అని తెలిపింది.ఫ్లాట్ ప్యాక్‌లను ఒకచోట చేర్చడం, ట్రామ్పోలిన్లను అమర్చడం, షెల్ఫ్‌లు నిర్మించడం, వస్తువులను ఇన్స్టాల్ చేయడం వంటి వాటికి జేమ్స్ సరైనడోని లారా చెబుతోంది. తన భర్తను అద్దెకిచ్చేందుకు సగటున 35 యూరోలు ఇంటికి వసూలు చేస్తున్నట్లు లారా చెప్పింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.