పెళ్లికి ముందు శృంగారం చేసిన జంటకు...అందరూ చూస్తుండగా ఆ శిక్ష విధించారు...

యువ జంట శృంగారంలో పాల్గొని తప్పుచేసారని నిర్థారించిన మత పెద్దలు వారిరువురికీ వంద కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇద్దరినీ బంధించి బహిరంగంగా శిక్షను అమలుచేశారు.

news18-telugu
Updated: August 3, 2019, 5:30 PM IST
పెళ్లికి ముందు శృంగారం చేసిన జంటకు...అందరూ చూస్తుండగా ఆ శిక్ష విధించారు...
కొరడా దెబ్బలు కొడుతున్న షరియా అధికారులు (Image : Twitter)
news18-telugu
Updated: August 3, 2019, 5:30 PM IST
షరియా చట్టం అమల్లో ఉన్న దేశాల్లో కఠినమైన శిక్షలు అమల్లో ఉంటాయి. తాజాగా ఇండోనేషియాలోని జకార్తాలో ఓ యువజంట వివాహానికి ముందు శృంగారంలో పాల్గొన్నందుకు బహిరంగంగా వంద కొరడా దెబ్బలు బాదిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇండోనేషియాలోని ఆకే ప్రావిన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. యువ జంట శృంగారంలో పాల్గొని తప్పుచేసారని నిర్థారించిన మత పెద్దలు వారిరువురికీ వంద కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇద్దరినీ బంధించి బహిరంగంగా శిక్షను అమలుచేశారు. దెబ్బల ధాటికి యువతి సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణ ఏర్పాటు చేసి మరీ, యువతికి వంద కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. ఇదిలా ఉంటే ఇండోనేషియాలో స్వలింగ సంపర్కం, పెళ్లికి ముందు శృంగారం వంటి పనులకు కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయి.First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...