WOMAN LISTED GETTING AS RS 25 CRORE COVID 19 GRANT SHE NEVER APPLIED FOR IT IN FLORIDA SU
Covid-19 Grant: వావ్.. గ్యాస్ స్టేషన్లో ఉద్యోగం చేసే మహిళకు రూ. 25 కోట్ల కోవిడ్ రిలీఫ్ ఫండ్.. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే..?
ప్రతీకాత్మక చిత్రం (Credits: Shutterstock)
ఓ మహిళకు భర్త.. ముగ్గురు పిల్లలు. అతి సాధారణమైన జీవతం గడుపుతున్న ఆమె.. ఓ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తోంది. అయితే ఆమె పేరుతో రూ. 25.4 కోట్లు కోవిడ్ రిలీఫ్ ఫండ్ చెక్ విడుదలైంది.
ఓ మహిళకు భర్త.. ముగ్గురు పిల్లలు. అతి సాధారణమైన జీవతం గడుపుతున్న ఆమె.. ఓ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తోంది. అయితే ఆమె పేరుతో 3.4 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 25.4 కోట్లు) కోవిడ్ రిలీఫ్ చెక్ విడుదలయిందని తెలుకున్న ఆమె షాక్ తింది. ఎందుకంటే.. ఆమె ఆ మొత్తాన్ని అందుకున్నట్టుగా రికార్డుల్లో ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తాను ఎలాంటి కోవిడ్ రిలీఫ్ ఫండ్ (COVID relief fund) కోసం దరఖాస్తు చేయలేదని, తాను ఎలాంటి నిధులు అందుకోలేదని ఆమె వెల్లడించింది. ఫ్లోరిడాలో (Florida) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. హోలీ హిల్ ప్రాంతంలో అమీ విలియమ్స్ అనే 44 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మూడేళ్లుగా ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉండిపోయింది. అయితే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల గ్యాస్ స్టేషన్లో పనిచేయడం (Gas station employee) ప్రారంభించింది.
అయితే ఫెడరల్ డేటా బేస్‌లో క్యాటరింగ్ వ్యాపారం కోసం అమీ విలియమ్స్... కోవిడ్ రెస్టారెంట్ రివిటలైజేషన్ ఫండ్స్‌లో కోట్లాది రూపాయలు అందుకున్నట్టుగా ఉంది. దీంతో ఈ విషయం అమీ విలియమ్స్ (Amy Williams) దృష్టికి రావడంతో ఆమె ఆశ్చర్యపోయింది. తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదని, నిధులు అందుకోలేదని, అసలు తాము రెస్టారెంట్ వ్యాపారంలో ఎప్పుడూ పనిచేయలేదని పేర్కొంది. మరోవైపు తన పేరిట మంజూరు అయిన చెక్‌లో పేర్కొన్న అడ్రస్‌లో తాను 8 ఏళ్లుగా నివసించడం లేదని తెలిపింది.
ఫ్లోరిడాకు చెందిన Daytona Beach News-Journal న్యూస్ పేపర్ ప్రకారం.. కోవిడ్ రిలీఫ్ ఫండ్స్ అందుకున్న 31 డేటోనా బీచ్ వ్యాపారాలలో (Daytona Beach business).. అమీ విలియమ్స్ అగ్రస్థానంలో ఉంది. అంటే ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అయింది ఆమె పేరిటే. అయితే అది కూడా ఆమెకు సంబంధం లేని క్యాటరింగ్ కోసం కేటాయించబడింది. ఇక, ఆ ప్రాంతంలో తదుపరి అత్యధిక అమౌంట్‌తో కూడి చెక్.. బీచ్‌సైడ్ నైట్ లైఫ్ స్పాట్(560,000 డాలర్లు) వెళ్లిందని ఆ న్యూస్ పేపర్ పేర్కొంది.
ఇక, అమీ విలియమ్స్ భర్త ఓ రెస్టారెంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇది ఒకటి మాత్రమే అమీ విలియమ్స్ కుటుంబానికి.. రెస్టారెంట్ పరిశ్రమతో ఉన్న సంబంధం. అయితే అమీ విలియమ్స్ భర్త పనిచేస్తున్న రెస్టారెంట్ కూడా ఎలాంటి రిలీఫ్ ఫండ్ అందుకోలేదు. ఇక, ఇందుకు సంబంధించి నిజాలను తెలుసుకోవాలనే కోరిక ఉందని.. అందుకు తాను చాలా ఇష్టపడతానని అమీ విలియమ్స్ తెలిపారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పారు. ప్రస్తుతం తాను కుటుంబంతో కలిసి నిరాడంబరమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్టుగా తెలిపారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైనా తప్పిదాన్ని గుర్తించారా అనే దానిపై వ్యాఖ్యానించడానికి స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించింది. అయితే ఇన్స్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం, ఫెడరల్ ఏజెన్సీ భాగస్వాములు.. మోపపూరిత ఘటనలను పరిష్కరించడానికి శ్రద్దగా పనిచేస్తున్నట్టుగా తెలిపింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.