'నవ్వు' ఎంత పనిచేసిందంటే.. రైల్లో ఆమె నరకం అనుభవించింది..

నోరు అలాగే తెరిచి ఉండటంతో.. నోటి నుంచి లాలాజలం కారడం మొదలైంది.అది చూసి కొంతమంది ప్రయాణికులు ఆమె నురుసులు కక్కుతుందేమో అనుకున్నారు. కొంతమంది ఆమెకు గుండెపోటు వచ్చిందనుకున్నారు.

news18-telugu
Updated: September 12, 2019, 3:07 PM IST
'నవ్వు' ఎంత పనిచేసిందంటే.. రైల్లో ఆమె నరకం అనుభవించింది..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 12, 2019, 3:07 PM IST
నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. కానీ అతిగా నవ్వితే అది కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. తాజాగా చైనాకి చెందిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. గత శనివారం ఓ మహిళ చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లోని గువాంగ్‌జౌ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కింది. రైల్లో ప్రయాణిస్తుండగా.. ఎందుకు నవ్వొచ్చిందో తెలియదు గానీ పగలబడి నవ్వడం మొదలుపెట్టింది. కాసేపటికి ఆమె నోరు అలాగే బిగుసుకుపోయింది.నోరు అలాగే తెరిచి ఉండటంతో.. నోటి నుంచి లాలాజలం కారడం మొదలైంది.అది చూసి కొంతమంది ప్రయాణికులు ఆమె నురుసులు కక్కుతుందేమో అనుకున్నారు. కొంతమంది ఆమెకు గుండెపోటు వచ్చిందనుకున్నారు.

అదృష్టవశాత్తు ఆ సమయానికి అదే రైల్లో డాక్టర్ ఉండటంతో ఆమెను పరీక్షించాడు. అతిగా నవ్వడం వల్ల ఆమె దవడ ఎముక బిగుసుకుపోయి.. నోరు అలాగే
తెరుచుకుని ఉండిపోయిందని నిర్దారించాడు. నెమ్మదిగా ప్రయత్నించి ఆమె దవడ మళ్లీ పూర్వ స్థితికి వెళ్లేలా చేశాడు. దాంతో సదరు మహిళ ఊపిరి పీల్చుకుంది.దవడ ఎముక బిగుసుకుపోయి నోరు తెరుచుకునే ఉండిపోవడంతో.. కొద్దిసేపు నొప్పితో నరకం అనుభవించినట్టు చెప్పింది. చైనాలో జరిగిన ఈ ఘటన అక్కడి మీడియాలో వైరల్‌గా మారింది.First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...