ఇంత మంచి మొగుడు నాకొద్దు.. విడాకులు కోరిన భార్య

భర్త తన ముందు మంచిగా నటిస్తున్నాడా? లేకపోతే లోపల ఒరిజినల్ కూడా అదేనా అని టెస్ట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేసిందట.

news18-telugu
Updated: August 22, 2019, 11:12 PM IST
ఇంత మంచి మొగుడు నాకొద్దు.. విడాకులు కోరిన భార్య
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘మా ఆయన చాలా మంచివాడు. అతడు బంగారం. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అయితే, ఇంత మంచి మొగుడు నాకొద్దు. నాకు విడాకులు కావాలి.’ అంటూ ఓ మహిళ కోర్టుకు వెళ్లింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ ఘటన జరిగింది. షార్జాలో నెల క్రితం ఓ జంటకు పెళ్లయింది. వివాహం జరిగినప్పటి నుంచి అతడు ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. భార్య పనులు చేస్తే కందిపోతుందేమో అనే భయంతో ఇంటి పనులు, వంట పనులు కూడా తనే చేసేస్తున్నాడట. తెల్లారేసరికి కాఫీ కప్‌తో నిద్రలేపుతున్నాడట. అయితే, భర్త తన ముందు మంచిగా నటిస్తున్నాడా? లేకపోతే లోపల ఒరిజినల్ కూడా అదేనా అని టెస్ట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేసిందట. అతడితో గొడవ పడిందట. భార్య మొదట గొడవపడి తిట్టినా కూడా భర్తే సారీ చెప్పేసి తప్పు ఒప్పేసుకుంటున్నాడట. దీంతో ఆమె కోర్టుకు వెళ్లింది. తన భర్త మంచితనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరింది. అయితే, తన భార్యకు తనకు విడాకులు ఇవ్వొద్దంటూ ఆ భర్త కోర్టును అభ్యర్థించాడు. దీంతో కోర్టు మీరూ మీరూ బయట సెటిల్ చేసుకోండని చెప్పి పంపింది.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>