Video : చేతిలో పసికందుతో యువతి పాటలు... నెటిజన్ల ప్రశంసలు...

Viral Video : మన రోడ్లపై డబ్బు కోసం పిల్లలతో బిక్షాటన చేయించే వాళ్లను చూస్తుంటాం. ఆమె అలా కాదు... డబ్బు కోసం చంటిపిల్లను ఎత్తుకొని ఆమె పాట పాడింది. నెటిజన్ల హృదయాల్ని కరిగించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 2:41 PM IST
Video : చేతిలో పసికందుతో యువతి పాటలు... నెటిజన్ల ప్రశంసలు...
చేతిలో పసికందుతో పాట పాడుతున్న యువతి (Image : FB - UNHCR, the UN Refugee Agency)
Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 2:41 PM IST
దక్షిణ అమెరికా దేశం పెరూ వీధుల్లో... ఓ మహిళ... రోజూ రెండు గంటల పాటూ... చంటి పిల్లను ఎత్తుకొని... పాటలు పాడుతోంది. ఆమె పాడుతున్న పాటలకు మెచ్చి అటుగా వెళ్లే ప్రజలు... ఎంతో కొంత చిల్లర ఆమెకు ఇస్తున్నారు. ఆమె ఎవరు? తొమ్మిది నెలల చంటిబిడ్డను ఎత్తుకొని ఎందుకు అలా పాటలు పాడుతోందన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పాటకు సంబంధించిన నిమిషం వీడియోని... ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్... తన ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ రోజు మీరు తప్పక వినాల్సిన పాట అని దానికి కాప్షన్ పెట్టింది. ఆమె వెనిజులాకి చెందిన మహిళ. ప్రస్తుతం వెనెజులా దేశం... తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. చాలా మంది ప్రజలు అక్కడి నుంచీ వలస వెళ్లిపోతున్నారు. అలా ఆమె కూడా... పెరూకి వలస వెళ్లిపోయింది. బతుకుదెరువు కోసం పాటలుపాడుతోంది. ఆమె... రోజూ వేర్వేరు వీధుల్లో రెండేసి గంటలపాటూ పాటలు పాడుతున్నా... పసికందును మాత్రం ఆమె ఎక్కడా దించట్లేదు. అదే నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది.


ఈ వీడియోని 43వేల మంది చూశారు. దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. మన అవసరాల విషయంలో మనం రాజీ పడగలం... అదే పిల్లల విషయంలో రాజీ పడలేం... అని ఓ నెటిజన్ స్పందించారు. మరెంతో మంది... పాజిటివ్ మెసేజ్‌లు పంపుతున్నారు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...