• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • WOMAN FINDS OUT SONS BRIDE IS HER LONG LOST DAUGHTER ON WEDDING DAY IN CHINA SU

చిన్నతనంలో తప్పిపోయిన కూతురే కోడలుగా వస్తుందని తెలుసుకున్న మహిళ.. కానీ అక్కడే అసలైన ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

చిన్నతనంలో తప్పిపోయిన కూతురే కోడలుగా వస్తుందని తెలుసుకున్న మహిళ.. కానీ అక్కడే అసలైన ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

కొడుకు పెళ్లి వేడుకలో చాలా ఏళ్ల కిందట తప్పిపోయిన కూతురు కంటపడటంతో మహిళ పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. తన కొడుకు పెళ్లాడబోయే అమ్మాయే కూతురని తెలుసుకుంది. ఆ తర్వాతే కథలో అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది.

  • Share this:
    ఓ పెళ్లి వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొడుకు పెళ్లి రోజున అతడు వివాహం చేసుకోబోయేది చాల ఏళ్ల కిందట కనిపించకుండా పోయిన తన కూతురినే అని తెలసుకున్న మహిళ భావోద్వేగానికి గురైంది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన కొడుకు పెళ్లికి అంతా సిద్దం చేసింది. మార్చి 31న పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే పెళ్లిరోజు ఆ మహిళ వధువు చేతిలో పుట్టమచ్చను గమనించి షాక్ తింది. చాలా ఏళ్ల కిందట తప్పిపోయిన ఆమె కూతురి చేతిలో పుట్టుమచ్చ మాదిరిగానే అనిపించడంతో.. ఆమె వధువు తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. వధువు గురించి వివరాలు ఆరా తీయడం ప్రారంభించింది. 20 ఏళ్ల కిందట ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నారా అంటూ ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానం చెప్పేందుకు వారు నిరాకరించారు.

    అమ్మాయిని తాము పెంచుకున్నామనే రహస్యం ఆమెకు ఎలా తెలిసిపోయిందని వధువు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అయితే చివరకు ఆ అమ్మాయిని చిన్నతనంలో రోడ్డు పక్కన గుర్తించామని.. అప్పటి నుంచి ప్రేమగా పెంచామని వారు తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన వధువు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత తాను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి తల్లే.. తనకు జన్మనిచ్చిన తల్లి అని తెలుసుకుంది. నిజమైన తల్లిదండ్రులను కలుసుకోవడం తన పెళ్లి రోజు కంటే సంతోషంగా ఉందని వధువు పేర్కొంది.

    అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. వధువుకు అసలు తల్లిదండ్రులు తెలియడంతో.. తన అన్ననే పెళళ్లాడుతున్నానని ఆమె ఆందోళ చెందింది. అయితే పెళ్లికొడుకు తనకు జన్మించిన వాడు కాదని.. తాను దత్తత తీసుకున్నట్టు మహిళ పేర్కొంది. కుమార్తె తప్పిపోయిన తర్వాత ఆమె ఆచూకీ కోసం ఎంతగానో వెతికానని.. అయితే ఫలితం లేకపోయిందని.. ఈ క్రమంలోనే ఈ అబ్బాయిని దత్తత తీసుకున్నానని చెప్పింది. ఇక, వారిద్దరు బయోలాజికల్ తోబుట్టువులు కానందున వారి పెళ్లికి సంబంధించి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఆ తర్వాత వరుడికి అసలు విషయం చెప్పి.. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి వేడుక ఆ మహిళా కుటుంబలో రెట్టింపు ఆనందాన్ని నింపిందని పెళ్లికి హాజరైన అతిథులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: