ash eating : ఇలా చేస్తోంది ఏమిటీ... భర్త చితభస్మాన్ని వెంటపెట్టుకుని అప్పుడప్పుడు అలా.. !

ash eating : ఇలా చేస్తోంది ఏమిటీ... భర్త చితభస్మాన్ని వెంటపెట్టుకుని అప్పుడప్పుడు అలా.. !

Dead body ash eating : బ్రిటన్‌కు ( Britan ) చెందిన ఓ మహిళ వింతగా ప్రవర్తిస్తోంది. ఆ మహిళ ( woman )తన చనిపోయిన భర్త చితభస్మాన్ని వెంటపెట్టుకుని తిరుగుతుందట.. అంతేకాదు ఆ బుడిదను ( ash eating ) కొంచెం కొంచెంగా కూడా తింటున్నానని చెబుతోంది. ఆ అలవాటును తాను మానలేనని చెప్పడం కూడా విశేషం .

  • Share this:
    సమాజంలో ఒక్కోకరి ఒక్కో అలవాటు ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు వ్యక్తిగత అలవాట్లు అంటూ లేని వారంటూ ఉండరు..కాని అలవాట్లు మాములుగా అయితే ఏదో తినడడం లేదా చూడడం లేదంటే గేమ్స్ ఇలా ప్రతి ఒక్కరికి వారికి ఇష్టమైన అలవాట్లు ఉంటాయి. అయితే ఇవన్ని కామన్ ఉంటాయి. కాని బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం వింత అలవాటు చేసుకుంది. ఏకంగా బుడిదను తినే అలవాటును చేసుకుంది. అది కూడా తన భర్త చితాభస్మం రోజు తినడంపై ఆమె ఆసక్తి కనబరుస్తోంది. దీంతో అలా తినడమే తన అలవాటు అని చెబుతోంది. ఇది చాలా వింతగా అనిపిస్తున్నప్పటికి

    అసలు విషయంలోకి వెళ్లితే బ్రిటన్‌కి ( Britain ) చెందిన కాసీ 2009లో సీన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే అతను ఆస్తమా కారణంగా మరణించాడు. ఈ క్రమంలో ఆమె అప్పటి నుంచి తన భర్త చితాభస్మాన్ని ( dead body ash ) తాను ఎక్కడకెళ్లితే అక్కడకి తనతోపాటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఈ మేరకు ఆమె తన భర్త చితాభస్మాన్ని కూడా తింటున్నానని దాన్ని ఆపలేనంటూ చెప్పుకొచ్చింది. పైగా ఆ బూడిద కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ చాలా ఇష్టంగా కొచెం కొంచెంగా తింటున్నానంటూ చెబుతోంది.

    ఇది చదవండి : ప్రతి రోజు వెయ్యి మరణాలు.. వారం రోజుల పాటు హలీడే..


    ఆమె తన భర్తను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టాయలని అనుకోవట్లేదని తనతోపాటు ఉన్నట్లుగా భావిస్తున్నందుకే ఇలా చేస్తున్నాను అంటోంది కాసీ. ఈ మేరకు బ్రిటన్‌ టీఎల్‌సీ ఛానెల్‌లోని 'మై స్ట్రేంజ్‌ అడిక్ట్‌' అనే కార్యక్రమంలో కాసీ తన వింత అలవాటు గురించి చెబుతూ నేను రోజు నా భర్త చితా భస్మాన్ని తింటున్నాను అంటూ పేర్కొంది. దీంతో ఆమె ఇచ్చిన ఇంటర్యూ.. కాస్త వైరల్‌గా మారింది.

    ఇది చదవండి : ఇంట్లో ఎవరు లేరని ప్రియుడిని పిలిపించుకుంది.. తమ్ముడు చూశాడని .. దారణం చేసింది.

    Published by:yveerash yveerash
    First published: