హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

రూ.500 పెట్టుబడితో నెలకు రూ.67వేల ఆదాయం.. ఈమె తెలివి మామూలుగా లేదుగా...

రూ.500 పెట్టుబడితో నెలకు రూ.67వేల ఆదాయం.. ఈమె తెలివి మామూలుగా లేదుగా...

బుడగలతో డబ్బు సంపాదిస్తున్న యువతి

బుడగలతో డబ్బు సంపాదిస్తున్న యువతి

ఆమె ఆన్‌లైన్‌లో 90 బబుల్‌గమ్స్ ఉండే ప్యాకెట్‌‌ను కొనుగోలు చేస్తుంది. ఒకేసారి 15-20 చూయింగ్ గమ్స్ నమలి.. వాటితో పెద్ద పెద్ద బుడగలను ఊదుతుంది.

  మనలో చాలా మందికి చూయింగ్ గమ్‌ని నమలడం ఇష్టం. కొందరు సరదా కోసం తింటే.. ఇంకొందరు మౌత్ ఫ్రెష్‌నర్‌గా వాడుతుంటారు. చాలా మంది చూయింగ్ గమ్‌ (Chewing Gum)ని బాగా నమిలిన తర్వాత.. బుడగలు ఊదుతుంటారు. బుడగలు ఎంత పెద్దగా వస్తే.. అంత హ్యాపీగా ఫీలవుతుంటారు. ఐతే ఆ బుడగలతో ఓ యువతి బిజినెస్ చేస్తోంది. వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముకుంటూ భారీగా సంపాదిస్తోంది. బుడగలను అమ్ముకోవడమేంటని అనుకుంటారా? ఐతే బుడగలను నేరుగా అమ్మదు. వాటిని వీడియో తీసి.. యూట్యూబ్‌ (Youtube)లో పోస్ట్ చేస్తుంది. అలా యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేసి బాగా సంపాదిస్తోంది.

  ఓమైగాడ్.. నడి సముద్రంలో భయానకం.. బోట్ పై తిమింగలం దాడి.. వైరల్ వీడియో.

  జర్మనీకి చెందిన 30 ఏళ్ల జూలియా ఫోరాట్‌కు చూయింగ్ గమ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ చూయింగ్ గమ్స్ నములుతుంటుంది. అది అలవాటుగా మారిపోయింది. ఐతే ఆ గమ్‌ను బాగా నమిలిన తర్వాత.. వాటితో బుడగలు ఊదుతుంది. ఏదో సరదాగా కోసం అలా చేసేది. ఐతే ఓసారి ఆమె మిత్రుడు వాటిని చూసి ఫిదా అయ్యాడు. చూయింగ్ గమ్‌తో... అంత పెద్ద బుడగలు వస్తాయా? అని ఆశ్చర్యపోయాడు. వీటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే... భారీగా వ్యూస్ వస్తాయని.. తద్వారా డబ్బులు కూడా బాగా వస్తాయని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే.. యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి.. అందులో వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించింది. వారు అనుకున్నట్లుగానే.. తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వ్యూస్ బాగా రావడంతో... ఆదాయం కూడా పెరిగింది. అలా ఆ బుడగలతోనే నెలకు రూ.67వేలు సంపాదిస్తోంది జూలియా.


  యూట్యూబ్‌లో జూలియా వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. జనాలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మాకు ఇలాంటి వీడియోలు చేయండని కోరేవారు. ఈ ఆకారంలో చేస్తే బాగుంటుంది.. అలా ట్రై చేసి చూడండి.. అంటూ సలహాలు ఇస్తారు. వారి అభిరుచి ప్రకారమే వీడియోలు చేస్తున్నారు జూలియా. భారీగా ఆదాయం వస్తున్నప్పటికి.. ఇది ఆమె పర్మినెంట్ జాబ్ కాదు. జూలియా ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, మార్కెటింగ్‌లో డిగ్రీలు ఉయి. ఐతే ఆమెకు చూయింగ్ గమ్‌తో బబుల్స్ ఊదడం చాలా ఇష్టం. అలా బబుల్స్ ఊదుతూ.. ప్రతి నెలా వేలల్లో సంపాదిస్తున్నారు జూలియా. సాధారణంగా ఆమె ఆన్‌లైన్‌లో 90 బబుల్‌గమ్స్ ఉండే ప్యాకెట్‌‌ను కొనుగోలు చేస్తుంది. ఒకేసారి 15-20 చూయింగ్ గమ్స్ నమలి.. వాటితో పెద్ద పెద్ద బుడగలను ఊదుతుంది.

  పెట్టుబడి లేదు. మార్కెటింగ్ లేదు. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆడుతూ పాడుతూనే.. నెలనెలా వేల రూపాయలను జూలియా సంపాదిస్తోంది. జూలియా చూయింగ్ గమ్స్ కొనడానికి కొనడానికి నెలకు 500 రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. కానీ వాటితో ఏకంగా 67,000 రూపాయలు సంపాదిస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Youtube

  ఉత్తమ కథలు